TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జూన్ 13వ రామ్‌చరణ్-ఉపాసనల కళ్యాణం !

Published on: Wed Feb 1, 2012 9:54AM

తిరుపతి: వచ్చే జూన్ నెల 13వ తేదీన మెగాస్టార్ తనయుడుహీరో రామ్ చరణ్  ఉపాసన వివాహం అంగరంగ వైభవంగా జరుగనుందని అపోలో గ్రూప్ ఆస్పత్రుల ఎండీ ప్రతాప్ సి రెడ్డి తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ కనుమూరి బాపిరాజు దంపతులతో కలసి ప్రతాప్‌ సి రెడ్డి దంపతులు మంగళవారం శ్రీవారి కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన ఆలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ రాంచరణ్, ఉపాసనల వివాహానికి ఇరువురి బంధువులు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. చిరంజీవి తరఫున తిరుపతి, తమ తరఫున అరగొండలో రిసెప్షన్ నిర్వహిస్తామన్నారు.

శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం అశ్వినీ ఆస్పత్రిలో 15 నెలల కిందట ఏర్పాటు చేసిన అపోలో అత్యవసర చికిత్సా కేంద్రం ద్వారా 1,300 మందికి గుండె సంబంధిత చికిత్స అందించామని ప్రతాప్‌రెడ్డి వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో చెన్నై కేంద్రంగా టెలీ-మెడిసిన్ సహకారం అందించేందుకు ప్రత్యేకంగా అంబులెన్స్ సర్వీసు ఏర్పాటు చేశామన్నారు.