TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జడ్జీల అప్పాయింట్‌మెంట్స్‌ కమీషన్ బిల్లుకు లోక్ సభ ఆమోదం

Published on: Thu Aug 14, 2014 9:00AM

 

న్యాయాన్ని కాపాడవలసిన న్యాయవ్యవస్థలో అవినీతి రాజ్యమేలుతోందని కొన్ని రోజుల కిందట ప్రెస్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ మార్కండేయ కట్జూ చేసిన వ్యాఖ్యలు కేంద్రాన్ని తట్టిలేపాయి. అందుకే న్యామూర్తుల నియామకాల ప్రక్రియను నిర్వహించే సుప్రీం కోర్టు కోలీజియం వ్యవస్థలో సమూలమయిన మార్పులు చేస్తూ మోడీ ప్రభుత్వం లోక్ సభలో జ్యుడీషియల్‌ అ ప్పాయింట్‌మెంట్స్‌ కమిషన్‌ బిల్లు ప్రవేశపెట్టింది. సభ్యుల సూచనల ప్రకారం ప్రభుత్వం దానిలో కొన్ని సవరణలు చేయడంతో లోక్ సభ నిన్న దానిని ఆమోదించింది. కాంగ్రెస్ పార్టీ కూడా ఆ బిల్లుకు మద్దతు ఇచ్చింది కనుక రాజ్యసభలో ఎన్డీయే కూటమికి తగినంత బలం లేనప్పటికీ అక్కడ కూడా కాంగ్రెస్ సహకారంతో బిల్లు ఆమోదం పొందడంలో పెద్ద ఇబ్బందేమీ ఉండదని భావించవచ్చును.

 

ఇదివరకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తితో సహా ముగ్గురు న్యాయమూర్తులు ఉండే కోలీజియం వ్యవస్థను ఇప్పుడు ఆరుగురు సభ్యులుంటారు. వారే ఇకపై న్యాయమూర్తుల నియామకాలు, బదిలీలు, పదోన్నతులు వంటి వ్యవహారాలను చూసుకొంటారు.