TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

గాలి బెయిల్: 15 కోట్ల లంచం కేసులో వేగం పె౦చిన సిబిఐ

Published on: Sat Jun 2, 2012 1:49PM

గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ కుంభకోణంలో రిటైర్డ్ న్యాయమూర్తి చలపతిరావు ఉన్నటు అనుమానిస్తున్న సిబిఐ అధికారులు చలపతిరావు నివాసంలోను మరియు చలపతి రావు ఇద్దరు సోదరుల నివాసాల్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. ఆరుగురు అధికారులు చలపతి రావు సోదరుల నివాసాల్లో సోదాలు చేస్తున్నారు. చలపతి రావుకు ఎవరెవరితో సంబంధాలున్నాయనే విషయంపై కూడా సిబిఐ అధికారులు ఆరా తీస్తున్నారు. గాలి జనార్దన్ రెడ్డితో పట్టాభిరామారావుకు డీల్ కుదుర్చడంలో ఐదుగురు వ్యక్తులు పాలు పంచుకున్నట్లు చెబుతున్నారు. డాక్యుమెంట్ రైటర్ శ్రీనివాస రావు నివాసంలోనూ, న్యాయవాది తారకరామ్ నివాసంలోనూ సిబిఐ అధికారులు సోదాలు చేస్తున్నారు. పట్టాభి రామారావు కేసులో ఏ క్షణంలోనైనా అరెస్టులు జరుగుతాయని భావిస్తున్నారు.