జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్!
posted on Oct 8, 2025 9:52PM

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరును అధిష్టానం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి, ఇతర సీనియర్ నాయకత్వం నవీన్ యాదవ్‌కు మద్దతుగా ఉన్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. సర్వేలలో ఆయన ముందంజలో ఉండడం బీసీ సామాజికవర్గం మద్దతు ఉండటంతో ఆమోదించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నిన్న జూబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి రేసులో నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు బొంతు రామ్మోహన్. జూబ్లీహిల్స్ అభ్యర్థిని కాంగ్రెస్ హై కమాండ్ నిర్ణయిస్తుందని రామ్మోహన్ తెలిపారు.
మరోవైపు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్‌లు ఇన్‌చార్జి మంత్రులు సూచించిన పేర్లపై సమీక్షించారు. నవీన్ యాదవ్, సీఎన్ రెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్ పేర్లను అధిష్ఠానానికి పంపారు.లోకల్ నాయకుడు కావడం గతంలో జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేయటంతో నవీన్ యాదవ్ వైపు మొగ్గుచుపినట్లు తెలుస్తోంది. 2014లో మజ్లిస్ తరపున పోటీ చేసి .. 9వేల ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి గోపీనాథ్ చేతిలో ఓడిపోయారు. 2019లో బీఆర్ఎస్ తో అవగాహన కారణంగా మజ్లిస్ టిక్కెట్ ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. సొంత బలంతోనే మూడో స్థానంలో నిలిచారు. 2023లోనూ అదే అవగాహన కొనసాగడంతో మజ్లిస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు.