TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఉద్యోగాల పేరిట మోసం?

Published on: Tue Jul 10, 2012 3:01PM

రాష్ట్రంలో ఇటీవల ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసే కార్పొరేట్‌ సంస్థల సంఖ్య పెరుగుతోంది. ఖాళీగా ఉన్న నిరుద్యోగుల వివరాలు సేకరించి వారికి ఉద్యోగం ఇప్పించేందుకు కన్సల్టేషన్‌ ఫీజు చెల్లించాలని డిమాండు చేస్తున్నారు. ఈ ఫీజు చెల్లించిన తరువాత ఉద్యోగం వస్తే ఆ కంపెనీ కూడా కొంత సొమ్ము చెల్లిస్తోంది. ఇలా కన్సల్టేషన్‌ల రూపంలో నడుస్తున్న సంస్థలు నగరంలో వేలకు వేలు పెరుగుతున్నాయి.

 

 

కార్పొరేట్‌ ట్రయినింగ్‌, కన్సల్టేషన్‌ ఖరీదైన ఫర్నీచరుతో ఈ సంస్థలు నిరుద్యోగులను నమ్మకంగా మోసం చేయగలుగుతున్నాయి. కంపెనీ నడిచినంత కాలం వీరి మోసాలు పోలీసుల దాకా వెళ్లటం లేదు. ఏ ఒక్కరోజు మూతపడినా వెంటనే నిరుద్యోగులు పోలీసులను సంప్రదించి తాము ఎంత ఫీజు చెల్లించారో చెప్పేస్తున్నారు. హైదరాబాద్‌నగరంలో ప్రతీ నెలా ఇటువంటి కేసులు కనీసం ఐదు నమోదవుతున్నాయని సమాచారం. తాజాగా కడప జిల్లాలో ఇటువంటి మోసమే వెలుగు చూసింది. ఈ కన్సల్టేషన్‌ను నమ్మి 140మంది ఫీజులు చెల్లించారు. దీని నిర్వాహకులు ఇద్దరు కేరళవాసులను పోలీసులు అరెస్టు చేశారు. లక్షా 11వేల రూపాయలు వీరి నుంచి స్వాధీనం చేసుకున్నారు. ల్యాప్‌టాప్‌, కారు కూడా స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి కన్సల్టెన్సీలపై ఫిర్యాదు కోసం ఒక ప్రత్యేకసెల్‌ను నిర్వహించాలని సూచనలు వస్తున్నాయి.