TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కొడాలి నాని పార్టీ మార్పులో ఎన్టీఆర్ హస్తం ఉందా?

Published on: Tue Jul 10, 2012 2:02PM

కొడాలి నాని జగన్ పార్టీలో చేరడంలో జూనియర్ ఎన్టీఆర్‌ హస్తం ఉందని ప్రచారం సాగుతుంది. నాని పార్టీ మార్పు వెనుక జూనియర్ హస్తం ఉందన్న వాదనలు ఖండించేందుకు ఆయన తన ఇంట్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో నాని తనకు సన్నిహితుడే చెప్పిన జూనియర్ ఆయన పార్టీ మార్పును ఖండించలేదు. నాని పార్టీ మారడానికి గల కారణాలు తనకేం తెలుసునని, ఆయననే అడగాలని, ఆయనకు గల కారణాలు ఆయనకు ఉండవచ్చునని అన్నారు.



ఆయితే కొందరు మాత్రం పార్టీ మారడానికి ముందు కొడాలి నాని జూనియర్ ఎన్టీఆర్‌తో భేటీ అయినట్లు, తాను పార్టీ  మారాలనుకుంటున్నానని నాని చెప్పారని అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌ రాజికీయాల్లోకి రావడానికి మరో పదేళ్లు పడుతుంది కాబట్టి, ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ పార్టీ లోకి వెళ్లడం మంచిదని నాని భావించాడని అంటున్నారు. జగన్ పార్టీలోకి వెళ్లేందుకు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉంటాడని, ఆయనకి తెలిసే ఇదంతా జరిగిందని అంటున్నారు.