రభస చేస్తున్న 'బాద్‌షా'

posted on: Feb 13, 2013 6:06PM

 

కొత్త సంవత్సరం మొదలయ్యి రెండు నెలలు గడిచిపోతున్నా ఇంతవరకు జూ. ఎన్టీఆర్ సినిమా ఒక్కటి కూడా విడుదల కాలేదు. అయినప్పటికీ, త్వరలో 'బాద్ షా' సినిమా విడుదల కానున్నందున ఆ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకొన్న ఎన్టీఆర్ అభిమానులు ఓపికగా ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్ తన మరో కొత్త సినిమా ‘రభస’ షూటింగు బుధవారంనాడు లాంచనంగా హైదరాబాదులో మొదలు పెట్టారు. 'కందిరీగ' సినిమాతో మంచి పేరు సంపాదించుకొన్న సంతోష్ శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకత్వం చేయనున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ తో సమంత జత కట్టనున్నది. వీరిద్దరూ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న మరో సినిమాలో కూడా జంటగా నటిస్తున్నారు.

 

'రభస' సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 15 వ తేదీనుండి హైదరాబాదులో మొదలవుతుంది. ఈ సినిమాను బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా దసరా, దీపావళి పండుగ సమయానికి విడుదలచేయాలని వారు అనుకొంటున్నారు. ఈ సినిమా కూడా ఎన్టీఆర్ మార్క్ కమర్షియల్ సినిమాగానే నిర్మించనున్నారు. ఈ సినిమా గురించి పూర్తీ వివరాలు త్వరలో ప్రకటిస్తామని నిర్మాత బెల్లంకొండ అన్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...