TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మెట్టుదిగని సర్కారు..బెట్టు వీడని జూడాలు

Published on: Sat Jan 28, 2012 9:31AM

హైదరాబాద్: జూనియర్ డాక్టర్ల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ఏమాత్రం మెట్టుదిగడం లేదు. అలాగే,జుడాలు కూడా తమ బెట్టు వీడటం లేదు. దీంతో రాష్ట్రంలో ప్రధానమైన పది బోధనా ఆసుపత్రుల్లో వైద్య చికిత్స పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారైంది. హైదరాబాద్, విజయవాడ, వరంగల్, విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, తిరుపతి, కర్నూలు, అనంతపురంలలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఉన్న బోధనా ఆసుపత్రుల్లో జూనియర్ డాక్టర్ల సమ్మె ప్రభావం స్పష్టంగా పడుతోంది.ఈ సమ్మెలో 4500 మంది పీజీ విద్యార్థులు, 150 మంది సూపర్ స్పెషాలిటీ కోర్సు చేస్తున్న డాక్టర్లు పాల్గొన్నారు. దీంతో ఈ ఆసుపత్రుల్లో వైద్యం అందించడం సీనియర్ వైద్యలకు తలకుమించిన భారంగా మారింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, జూడాల స్థానంలో పనిచేసేందుకు ఇతర డాక్టర్లు ఎవరూ మొగ్గు చూపక పోవడంతో పరిస్థితి మరింత విషమంగా మారింది.