TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జూడాల దీక్ష ఉధృత రూపం:నేడు చలో హైదరాబాద్

Published on: Wed Feb 1, 2012 8:36AM

హైదరాబాద్: జూనియర్ డాక్టర్ల దీక్ష ఉధృత రూపం దాల్చుతోంది.తమ డిమాండ్ల సాధన కోసం ఈ రోజు  జూనియర్ డాక్టర్లు చలో హైదరాబాదుకు పిలుపునిచ్చారు.  ఈ రోజు  ఉదయం పది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జిల్లాల నుంచి జూనియర్ డాక్టర్లు హైదరాబాదు చేరుకునే విధంగా కార్యక్రమాన్ని రూపొందించారు.వారు డిమాండ్ చేస్తున్నది రూ. తమ డిమాండ్ల పరిష్కారం విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న మొండివైఖరికి నిరసనగా ఆందోళనను మరింత ఉధృతం చేయాలని జూనియర్ డాక్టర్లు నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే వారు చలో హైదరాబాదుకు పిలుపునిచ్చారు. అదే సమయంలో రేపు సాయంత్రం నాలుగు గంటలకు అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నారు.


గత నెల రోజులుగా జూనియర్ డాక్టర్లు దశలవారీగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ ముందుకు సాగుతున్నారు. తొలుత రిలే నిరాహార దీక్షలు చేస్తూ సాధారణ సేవలను బహిష్కరించారు. ప్రభుత్వం తమపై ఎస్మా ప్రయోగిస్తే భయపడేది లేదని వారు స్పష్టం చేస్తున్నారు. సికింద్రాబాదులోని గాంధీ ఆస్పత్రిలో ఆరుగురు జూనియర్ డాక్టర్లు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఏడో రోజుకు చేరింది. వారిలో నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. వారిని దీక్షా శిబిరం నుంచి ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒకతను దీక్ష విరమించాడు. మిగతా ఇద్దరిని ఈ రాత్రి శిబిరం నుంచి తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. వారిని ఆస్పత్రికి తరలిస్తే సామూహిక ఆమరణ నిరాహార దీక్షలకు దిగే యోచనలో జూనియర్ డాక్టర్లున్నారు.రాష్ట్రంలో పది టీచింగ్ ఆస్పత్రులు ఉన్నాయి. ఈ పది టీచింగ్ ఆస్పత్రుల్లో ఒక్కో ఆస్పత్రి నుంచి ముగ్గురేసి ఆమరణ నిరాహార దీక్షకు దిగేందుకు సిద్ధపడుతున్నారు. ప్రభుత్వం తన మొండి వైఖరిని విడనాడకపోతే అత్యవసర సేవలను కూడా బహిష్కరిస్తామని జూనియర్ డాక్ట్రర్లు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే జూనియర్ వైద్యుల ఆందోళనకు ప్రతిపక్షాలన్నీ మద్దతు ప్రకటించాయి.