TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అయ్యో పాపం.. జగన్ బ్యాచ్ ఐపీఎస్‌లు.. జేసీ!

Published on: Wed Aug 14, 2024 5:05PM

కండీషన్‌ బెయిల్‌ మాదిరి ఐపీఎస్‌ అధికారులు రోజూ డీజీపీ కార్యాలయంలో సంతకాలు పెట్టాల్సి రావడం దురదృష్టకరమని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. జగన్ చెప్పినట్టల్లా పనిచేసి ప్రజల్ని, తమను ఎన్ని ఇబ్బందులు పెట్టారో కొంతమంది ఐపీఎస్‌లు ఇప్పటికైనా గుర్తించాలని హితవు పలికారు. గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాల వల్ల ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులకు ఇలాంటి పరిస్థితి రావటం బాధాకరమన్నారు. ఇప్పటికైనా తీరు మార్చుకుని వ్యవహరిస్తారని ఆశిస్తున్నట్టు చెప్పారు. ఏపీలో కొంతమంది ఐపీఎస్‌ల పరిస్థితి తమకన్నా దారుణంగా తయారైందని, తమ మీద కేసులు పెట్టి, రోజూ పోలీస్ స్టేషన్‌కి వచ్చి సంతకాలు పెట్టమనేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి ఐపీఎస్‌లకు రావడం బాధాకరమని జేసీ అన్నారు. ఈ విషయంలో సదరు ఐపీఎస్‌ల కంటే తామే నయమని ఆయన చెప్పారు. తాము సంతకం చేసి వెంటనే ఇంటికి వెళ్ళిపోతామని, పాపం ఈ ఐపీఎస్‌లు సంతకం చేసి రోజంతా ఆఫీసులో పనిలేకుండా వెయిట్ చేయాల్సి వుంటుందని సానుభూతి వ్యక్తం చేశారు.