పవన్ కు జేపీ పంచ్.. కామన్ సెన్స్ ఉండాలి...

 

జేఎఫ్సీ కమిటీ అన్నారు.. అందరి నిగ్గు తేల్చుతా అన్నారు... అసలు కేంద్ర ప్రభుత్వం అబద్దం చెబుతుందా.. రాష్ట్ర ప్రభుత్వం అబద్దం చెబుతుందా నిజాలు బయటపెడతా అన్నారు... అఖరికి సైలెంట్ అయిపోయారు... ఎవరి గురించి మాట్లాడుతున్నామో ఇప్పటికే అర్ధమైపోయి ఉండొచ్చు. ఇంకెవరూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్. జేఎఫ్సీ మీటింగ్ అంటూ హడావుడి చేసి జేపీ, ఉండవల్లి అరుణ కుమార్ వంటి నలుగురు పెద్ద తలకాయలను పక్కనపెట్టుకొని నాలుగు రోజులు హడావుడి చేశారు. ఇక ఒక మీటింగ్ పెట్టి కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఇచ్చింది ఏం లేదని..ఇంకా 75 వేల కోట్ల ఇవ్వాలని చెప్పి చెప్పారు. ఇక అంతే అప్పటినుండి ఇప్పటివరకూ కమిటీ అడ్రస్సే లేదు. ఎవరి పనిలో వాళ్లు మునిగిపోయారు. పవన్ అయితే అసలు తాను ఓ కమిటీ ఏర్పాటు చేశాననే సంగతే మర్చిపోయినట్టు ఉన్నాడు.

 

ఇక ఇలా అయితే వర్కవుట్ కాదని అనుకున్నారేమో జేపీ తానే ఓ కమిటీ ఏర్పాటు చేశారు.  ఇండిపెండెంట్ గ్రూప్ ఆఫ్ ఎక్స్ పర్ట్స్(ఐజీఎఫ్) పేరిట ఓ కమిటీని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి తొలి మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆయన పవన్ పై కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. జేఎఫ్సీ పై పవన్‌ తొలుత చూపిన శ్రద్ధ తర్వాత చూపడం లేదని, అది ఒక ఈవెంట్ గా జరిగింది అంటూ, జేపీ ఘాటు వ్యాఖ్యలే చేసారు. లెక్కలు తేల్చిన తర్వాత ఎలాంటి చర్యలు లేవని, అందుకే స్వతంత్ర నిపుణులతో కమిటీ ఏర్పాటు చేశామన్నారు. జేఎఫ్‌సీ తొలిదశ అయితే... నిపుణుల కమిటీ రెండో దశ అని జేపీ అన్నారు...  ఈ బృందంలో మాజీ ఐఏఎస్ పద్మనాభయ్య, ప్రొ.గలాబ్, రాఘవాచారీ, శాంతాసిన్హా, హెచ్ఏ దొర, ఇతర ప్రముఖులుంటారని చెప్పారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా లేఖపై కూడా నిపుణుల బృందం అధ్యయనం చేస్తుందని చెప్పారు...

 

అయితే జేపీ కమిటీ పై పవన్ కళ్యాణ్ స్పందించారు. జేపీ ఏర్పాటుచేయబోయే స్వతంత్ర కమిటీని స్వాగతిస్తున్నానని ట్విట్టర్ లో ఓ ట్వీట్ చేశారు. ఈ కమిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమస్యలు, ప్రత్యేక హోదా, ఇతర సమస్యలపై లోతుగా అధ్యయనం చేయాలని కోరారు. ఇక పవన్ ట్వీట్ కు, జేపీ స్పందిస్తూ మరో ట్వీట్ చేసారు...ఆంధ్రప్రదేశ్ సమస్యల పరిష్కారం, కామన్ సెన్స్ తో ప్రవర్తిస్తే, అన్నీ పరిష్కారం అవుతాయి అనే నమ్మకం నాకు ఉంది అంటూ, ఒక పంచ్ వేసారు జేపీ. ఇప్పటికే పవన్ పై కన్ఫ్యూజన్ మాస్టర్ అనే ముద్ర పడింది. మరి కన్ఫ్యూజన్ రాజకీయాలు మానేసి..పవన్ ఓ క్లారిటీకి ఎప్పుడు వస్తాడో ఏమో.. లేకపోతే ఇలానే ఉండే ఆయన అభిమానుల్లో కూడా ఇదే కన్ఫ్యూజన్ ఏర్పడి మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది..