TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జేపీ నడ్డా హైదరాబాద్ పర్యటన!

Published on: Sat Sep 28, 2024 2:11PM

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శనివారం (సెప్టెంబర్ 28) హైదరాబాద్.లో  పర్యటించనున్నారు.  సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి నేరుగా ఐటీసీ కాకతీయకు వెడతారు.  అనంతరం 5:45 నుంచి 6:05 వరకు సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం హరిత ప్లాజాలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాష్ట్ర పదాధికారులతో సమావేశమౌతారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, సభ్యత్వ నమోదు, స్థానిక సంస్థల ఎన్నికలు తదితర అంశాలపై చర్చిస్తారు.  రాత్రి 9.15 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ కి తిరుగు ప్రయాణం అవుతారు.