TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జోషిమఠ్ కుంగిపోతోంది..అధికారికంగా ధృవీకరించిన కేంద్రం

Published on: Mon Jan 9, 2023 5:14AM

ఉత్తరాఖండ్ లో అత్యంత పవిత్రమైన జోషీమఠం కుంగిపోతోందని కేంద్రం అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే భూమి కుంగిపోయి వందలాది ఇళ్లు బీటలు వారాయి. పట్టణంలోని జనం బిక్కుబిక్కు మంటూ జీవిస్తున్నారు. పట్టణం సింకింగ్ జోన్ లో ఉందని కేంద్రం ప్రకటించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు ప్రారంభించింది.  ఇప్పటికే  కొన్ని కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది.  

రిలీఫ్ సెంటర్లను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. హిమాలయ పట్టణమైన జోషిమఠ్   కుంగుబాటుకు గురై అత్యంత ప్రమాదకర స్థితికి చేరుకుంది. ఇప్పటికే ఛమోలీ జిల్లా కలెక్టర్ హిమాన్షు ఖురానా గడప గడపకు వెళ్లి స్థానికులను కలుస్తున్నారు. చీలికలు వచ్చిన భవనాల్లో ఉంటున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

జోషిమఠ్ లో 4,500 భవనాలుండగా వీటిలో 610 భవనాలు బీటలు వారాయి.వాటిలో నివసిస్తున్న వారు ప్రాణాలు అరచేత పట్టుకుని బిక్కుబిక్కుమంటూ నివసిస్తున్నారు. మొత్తం సహాయక చర్యలను ప్రధానమంత్రి కార్యాలయం స్వయంగా పర్యవేక్షిస్తోంది. సాధ్యమైనంత త్వరగా వారినందరినీ అక్కడి నుంచి తరలించాలని కేంద్రం భావిస్తోంది.