రెండో రోజు కస్టడీలో జానీమాస్టర్

posted on: Sep 26, 2024 12:51PM

లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ కొరియోగ్రాఫర్ జాని మాస్టర్ ను నార్సింగ్ పోలీసులు కస్టడీలో తీసుకున్న సంగతి తెలిసిందే. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ శ్రేష్ట వర్మపై అత్యాచారం, దాడి తదితర కేసుల్లో అరెస్ట్ అయి 14 రోజుల రిమాండ్ లో ఉన్న జాని మాస్టర్ ను నిన్న పోలీసులు కస్టడీలో తీసుకుని ప్రశ్నించారు. వరుసగా నాలుగు రోజుల పాటు  జాని మాస్టర్ కస్టడీలో  ఉండటానికి కోర్టు అనుమతించింది. అతనిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించకూడదని కోర్టు పోలీసులను ఆదేశించింది. న్యాయవాది సమక్షంలో జాని మాస్టర్ ను విచారిస్తున్నారుఅయితే మొదటి రోజు ప్రశ్నలకు జాని మాస్టర్ జవాబివ్వలేదు.  మౌనం పాటించారు. రెండో రోజు జాని మాస్టర్ ను పోలీసులు ప్రశ్నలు అడిగినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. రెండో రోజు జాని మాస్టర్ భార్య సుమలతను కూడా పోలీసులు ప్రశ్నించారు. పాన్ ఇండియా వంటి నిర్మాణ సంస్థకు కొరియాగ్రాఫర్ గా ఉన్న జాని మాస్టర్ అత్యాచారం కేసులో ఇరుక్కుని రిమాండ్ లో ఉండటంతో అతని కెరీర్ ప్రమాదంలో పడింది. 

google-ad-img
    Related Sigment News
    • Loading...