జేఎన్‌యూలో చేరేందుకు విద్యార్థుల విముఖత
Published on: Thu Mar 31, 2016 11:21AM
.jpg)
జేఎన్‌యూ అంటే ఒకప్పుడు అంతర్జాతీయ స్థాయి విశ్వవిద్యాలయంగా భావించేవారు. అందులో చేరాలని మేధావులంతా తపించేవారు. జేఎన్‌యూ పూర్వవిద్యార్థుల జాబితా చూస్తేనే అర్థమైపోతుంది. అక్కడ నుంచి ఎలాంటి హేమాహేమాలు తయారయ్యారో. కానీ ఇదంతా పూర్వవైభవం కానుందా? జేఎన్‌యూ ప్రతిష్ట మసకబారిందా? అంటే అవుననే అంటున్నాయి గణాంకాలు.
గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది జేఎన్‌యూలో చేరాలనుకునే విద్యార్థుల సంఖ్య దాదాపు ఐదు శాతం తగ్గిపోయిందట. జేఎన్‌యూలోని వివిధ కోర్సులకుగాను ఆ విశ్వవిద్యాలయానికి అందిన దరఖాస్తుల వెల్లువలో మార్పు వచ్చిందంటున్నారు అధికారులు. ఏటా పెరుగుతూ వచ్చే ఈ దరఖాస్తులు ఈసారి 3,000కు పైగా తగ్గిపోయాయట. ఇటీవల జేఎన్‌యూలో జరిగిన పరిణామాలే దీనికి కారణం అంటున్నారు విశ్లేషకులు. అటు విద్యార్థుల వివాదాస్పద సభలు, వాటి మీద ప్రభుత్వం తీసుకున్న కఠిన చర్యలతో... జేఎన్‌యూకి చెడ్డపేరు వచ్చిందంటున్నారు. ఇందులో నిజం ఎంతో కన్నయ కుమార్‌కే ఎరుక!


