TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కన్నయా, రాహుల్‌ కలిసిపోయారా!

Published on: Wed Mar 23, 2016 2:11PM

జేఎన్‌యూలో వివాదాస్పద సమావేశాన్ని నిర్వహించి జాతిద్రోహం కేసులో ఇరుక్కున్న కన్నయాకుమార్‌ ప్రస్తుతం బెయిలు మీద తిరుగుతున్నారు. ఈ వివాదం తరువాత కన్నాయ చాలామందికి అభిమాన నాయకుడిగా మారిపోయారు. రాహుల్‌ సైతం ఈ విషయంలో కన్నయాకు అనుకూలంగా ఉన్నట్లు తేలిపోయింది. కన్నయాను ప్రభుత్వం అన్యాయంగా అరెస్టు చేసిందంటూ, రాహుల్ తరచూ మండిపడుతున్నారు. అంతేకాదు! ఈ వివాదం తారస్థాయిలో ఉన్నప్పుడు, రాహుల్ జేఎన్‌యూని సందర్శించి అక్కడి విద్యార్థులకు తన మద్దతుని సైతం అందించారు. ఇదిలా ఉండగా కన్నయా కూడా వెళ్లి వెళ్లి రాహుల్‌గాంధిని కలవడం చర్చనీయాంశంగా మారింది. ఈ సమావేశం స్నేహపూర్వకంగానే జరిగిందని చెబుతున్నప్పటికీ, అందులోని వివరాలను మాత్రం ఎవ్వరూ వెల్లడించడం లేదు.

కన్నయా ఇప్పటికే రాజకీయాలలోకి రానున్నారని సీతారాం ఏచూరి ప్రకటించేశారు. తమ పార్టీ తరఫున కన్నయా పశ్చిమబెంగాల్లోని ఎన్నికలలో ప్రచారం చేయనున్నారని కూడా చెప్పారు. అక్కడ కాంగ్రెస్, వామపక్షాలు కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే! అంటే రాజకీయంగా ఇప్పటికే కన్నయా, రాహుల్‌ ఒకే పక్షాన ఉన్నారన్నమాట. మరోవైపు ఇటు రాహుల్‌, అటు కన్నయా కూడా బీజేపీని అదను దొరికినప్పుడల్లా విమర్శిస్తున్నారు. మరి మున్ముందు వీరిద్దరూ కలిసి బీజేపీ వ్యతిరేకంగా పోరాడనున్నారా? ఏమో రాజకీయాలలో ఏదైనా జరగవచ్చు!