TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కాశ్మీర్ ఎన్నికలలో పోటీ చేయను.. మెహబూబా!

Published on: Thu Aug 29, 2024 12:32PM

జమ్మూకశ్మీర్ ఎన్నికలలో తాను పోటీ చేయడం లేదని పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ నాయకురాలు మెహబూబా ముఫ్తీ ప్రకటించారు. కేంద్ర పాలిత ప్రాంతంలో తమ పార్టీ తన విధానాలను అమలు  చేయలేదని ఆమె చెప్పారు. తాను గతంలో సీఎంగా ఉన్నప్పుడు 12 వేల మందిపై ఉన్న ఎఫ్ఐఆర్‌లు రద్దు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితులు జమ్ము కాశ్మీర్‌లో లేవని అన్నారు. ముఖ్యమంత్రి పీఠం మీద వుండి కూడా ఒక్క ఎఫ్ఐ‌ఆర్‌ని కూడా వెనక్కి తీసుకోలేని స్థితిలో వుంటే, ఆ ముఖ్యమంత్రి పదవే అనవసరం అని ఆమె వ్యాఖ్యానించారు. ఇదిలా వుంటే, జమ్ము కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్నంతవరకు తాము ఎన్నికలకు దూరంగా ఉంటామన్న నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. త్వరలో జరగనున్న ఎన్నికలలో పోటీ చేయనున్నట్టు ప్రకటించారు.