TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఒక రూపాయికే 100 ఎంబీ డేటా.. జియో బంపర్ ఆఫర్ 

Published on: Wed Dec 15, 2021 4:39PM

టెలికాం సంస్థలు ఇటీవలే టారిఫ్ మార్చేశాయి డేటా రేట్లను పంచేశాయి.  ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో కూడా టారిఫ్ లను భారీగా పెంచింది.  1 జీబీ డేటాను మొన్నటి వరకు  11 రూపాయలకు  అందించిన జియో... దాన్ని రూ. 15కి పెంచింది. దీంతోపాటు అన్ని టారిఫ్ లను ఆ సంస్థ పెంచేసి వినియోగదారులపై భారం మోపింది. అయితే తాజాగా జియో వినియోగదారులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. 

తన కస్టమర్లకు స్వల్ప ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది రిలయన్స్ జియో. 100 ఎంబీ డేటాను 1 రూపాయికి అందిస్తున్నట్టు ప్రకటించింది. అంటే 1 జీబీ డేటా 10 రూపాయలకు వస్తుందన్నమాట. అంతేకాదు 28 రోజుల వాలిడిటీని 30 రోజులకు పెంచుతున్నట్టు జియో ప్రకటించింది. జియో తీసుకున్న తాజా నిర్ణయం ఇతర టెలికాం కంపెనీలకు షాకిస్తోంది. జియో బాటలోనే ఇతర టెలికాం సంస్థలు తమ టారిఫ్ ను మార్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.