ఫ్రీ..ఫ్రీ..ఫ్రీ.. రెండేళ్ళు కాల్స్ నెట్ ఫ్రీ..

రెండేంళ్ళు ఫ్రీ నెట్.. ఫ్రీ కాల్స్..వినియోగదారులకు జియో పండగ. మార్చ్ 1 నుండే మార్కెట్లోకి జియో కొత్త ఫోన్లు. అందరికి అందుబాటు ధర 1499 కొత్త జియో ఫోన్లు.ఇక నినియోగ దారులకు పండగే పండగ.. రిలియన్స్‌ జియో.. ఫీచర్‌ ఫోన్‌ వినియోగదారుల కోసం సరికొత్త బండిల్డ్‌ ఆఫర్‌ను ప్రకటించింది. 2జీ సేవల నుంచి భారత్‌ను విముక్తం చేయాలన్న ఆలోచనకు అనుగుణంగా అందుబాటు ధరల్లో కొత్త ఆఫర్‌ను తీసుకువచ్చింది. న్యూ జియోఫోన్‌ 2021 ఆఫర్‌ పేరుతో రెండేళ్ల పాటు అన్‌లిమిటెడ్‌ వాయుస్‌ కాల్స్‌, ప్రతి నెల 2 జీబీ డేటాతో కొత్త ఫోన్‌ను జియో విడుదల చేసింది. మార్చి 1 నుంచి ఈ కొత్త ఆఫర్‌ అందుబాటులో ఉంటుందని తెలిపింది. భారత్‌ 5జీ లోకి అడుగుపెడుతున్న సమయంలో కూడా 30 కోట్ల మంది సబ్‌స్ర్కైబర్లు ఇంకా బేసిక్‌ ఫీచర్లతో 2జీ ఫోన్లతోనే కాలం వెళ్లబుచ్చుతున్నారని, వీరందరికీ అత్యుత్తమ సేవలందించాలన్న లక్ష్యంతో ఈ ఆఫర్‌ను ప్రకటించినట్లు రిలయన్స్‌ జియో డైరెక్టర్‌ ఆకాశ్‌ అంబానీ వెల్లడించారు. కొత్త యూజర్లకు రూ.1,999 ధరకే జియో ఫోన్‌నుతో పాటు రెండేళ్లకు సరిపడా పరిమిత కాల్స్‌, ప్రతి నెల 2జీబీ హైస్పీడ్‌ డేటాను ఈ ఆఫర్‌ ద్వారా వినియోగదారులకు అందించనున్నట్లు వెల్లడించింది. అలాగే 1,499 ధరతో ఏడాది పాటు ఇదే తరహా సేవలతో ఫోన్‌ను ఆఫర్‌ చేస్తున్నట్లు వివరించారు.

ఆసియా నెంబర్ వన్ మళ్ళీ అంబానే..

ఆసియా కుబేరుల జాబితాలో ముకేశ్‌ అంబానీ మళ్లీ అగ్రస్థానానికి చేరుకున్నారు. రెండు నెలల క్రితం ముకేశ్‌ను వెనక్కి నెట్టి నం.1గా ఎదిగిన చైనా పారిశ్రామికవేత్త జాంగ్‌ షాన్షాన్‌ ఆస్తి ఈ వారంలో 22 క్షీణించి 7,660 కోట్ల డాలర్లకు పడిపోయింది. అంబానీ సంపద 8,000 కోట్ల డాలర్ల కంటే తగ్గడంతో ఆయన రెండో స్థానానికి చేరాడు. ఈ వారం మన మార్కెట్లు భారీ నష్టాలు వచ్చినప్పటికీ రిలయన్స్‌ షేర్లపై అంతగా నష్టాల ప్రభావం చూపకపోవడం అంబానీకి కలిసివచ్చింది. రెండేళ్ల క్రితం అలీబాబా వ్యవస్థాపకుడు జాక్‌ మా ను వెనక్కి నెట్టి అంబానీ తొలిసారిగా ఆసియా కుబేర కిరీటాన్ని చేజిక్కించుకున్నారు.