జియో ఫోన్ ఫీచర్లు ఇవే..

 

జియో మరో సంచలానికి తెర తీసిన సంగతి తెలిసిందే. అత్యంత చౌకధరకే 4జీ ఫీచర్ ఫోన్ ను రిలయన్స్ సంస్థ వినియోగదారులకు అందిచనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆగష్ట్ లో ఈ ఫోన్ల ఆన్ లైన్ బుకింగ్ ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ లో మార్కెట్ లోకి విడుదల కానున్నాయి. అంతేకాదు జియో కస్టమర్లకు ఈ ఫోన్లు ఫ్రీగా అందించనున్నారు. కాగా ఈ ఫోన్ ఫీచర్లు ఏంటంటే..


* 2.4 ఇంచుల స్క్రీన్.
* ఆల్ఫాన్యూమరిక్ కీ ప్యాడ్.
* టార్చ్ లైట్ కోసం ప్రత్యేక బటన్.
* హెడ్ ఫోన్ జాక్.
* మైక్రోఫోన్, స్పీకర్.
* ఎఫ్ ఎం రేడియో.
* ఎక్స్ పాండబుల్ మెమొరీ కార్డ్ స్లాట్.
* 4-వే నావిగేషన్.
* అన్ని భారతీయ భాషలను సపోర్ట్ చేస్తుంది.
* వాయిస్ కమాండ్స్ ద్వారా కూడా ఫోన్ ను ఆపరేట్ చేయవచ్చు.
* ఇంటర్నెట్ ను బ్రౌజ్ చేసే అవకాశం.
* జియో యాప్స్ అన్నీ ప్రీలోడ్ అయి ఉంటాయి.
* జియో సినిమా యాప్ తో సినిమాలు చూసే అవకాశం.