జియో కస్టమర్లకు బంపరాఫర్.. ఫ్రీగా ఫోన్..

 

ఇప్పటికే పలు సంచనాలను సృష్టించిన జియో.. మరో సంచలనానికి శ్రీకారం చుట్టింది. రిలయన్స్ సంస్థం వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆ సంస్థ అధినేత ముఖేష్ అంబానీ వరాల జల్లు కురిపించారు. జియో కొత్త ఫోన్లు, అన్ లిమిటెడ్ డేటా, అన్ లిమిటెడ్ టాక్ టైమ్, ఫోన్ టు టీవీ కనెక్టివిటీ ఇలా ఎన్నో కొత్త కార్యక్రమాలను, పథకాలను ఆయన ప్రకటించారు. కొత్త 4జీ ఫోన్ ను పొందేందుకు రూ. 1500 డిపాజిట్ గా చెల్లించాల్సి వుంటుందని, దీన్ని మూడేళ్ల తరువాత పూర్తిగా వెనక్కు ఇచ్చేస్తామని ముఖేష్ అంబానీ ప్రకటించారు. ఈ ఫోన్లు మిస్ యూజ్ కాకుండా చూసేందుకు, ఉచిత జియో ఆఫర్ దుర్వినియోగం కాకుండా చూసేందుకు సెక్యూరిటీ డిపాజిట్ గా రూ. 1500 తీసుకోవాలని నిర్ణయించామని అన్నారు. అంతేకాదు జియో కస్టమర్లకు ఓ బంపరాఫర్ కూడా ఇచ్చారు. జియో కస్టమర్లకు జియో ఫోన్ ఉచితమని తెలిపారు. భారతీయులందరికీ ఈ ఫోన్ అందుబాటులో ఉంటుందని, ఆగస్టు నుండి ఆన్ లైన్ బుకింగ్ ఉంటుందని.. సెప్టంబర్ నుండి కస్టమర్లకు మార్కెట్ లో అందుబాటులో ఉంటుందని ప్రకటించారు.