జియో మరో సంచలనం.. 4జీ ఫోన్ విడుదల...

 

అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ప్రకటన రానే వచ్చింది. మార్కెట్ లోకి  జియో ఫోన్ విడుదల చేస్తున్నట్టు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ప్రకటన చేశారు. వాయిస్ కమాండ్ తో పనిచేయనున్న ఈఫోన్ 22 భాషల్లో అందుబాటులోకి రానుంది. వాయిస్ కమాండ్ తో కాల్స్, మెసేజ్ లు ఉచితంగా చేసుకోవచ్చని చేసుకోవచ్చు. ఈ సందర్భంగా ముఖేష్ అంబానీ మాట్లాడుతూ... జియో ఇప్పటికే పలు ప్రపంచ రికార్డులు సృష్టించింది...170 రోజుల్లో 11 కోట్ల మంది కస్టమర్లు జియోను తీసుకున్నారు..ప్రతి సెకనుకు ఏడుగురు కస్టమర్లను ఆకర్షించగలిగామని తెలిపారు. అంతేకాదు..జియో కస్టమర్లు నిమిషానికి 250 కోట్ల  డేటాను వాడుతున్నారని.. మొబైల్ డేటా వాడకంలో అమెరికా, చైనాలను మించిపోయాం.. ఫేస్ బుక్, వాట్సాప్ లను మించిపోయాం..మొబైల్ డేటా వాడకంలో భారత్ 155 వ స్థానం నుండి మొదటి స్థానానికి ఎదిగిందని అన్నారు. తక్కువ ధరకు 4జీ సేవలను దగ్గర చేసేందుకు నిర్ణయించుకున్న తరువాతనే, అత్యంత తక్కువ ధరకు 4జీ ఫీచర్ ఫోన్ ను అందించాలని ముందడుగు వేసినట్టు తెలిపారు. చౌక ధరలో డేటా సాయంతో వాయిస్ కాల్స్ చేసుకునే ఫోన్ తయారీకి ఎంతో శ్రమించామని, ఈ రోజు నుంచి ఫీచర్ ఫోన్ల నుంచి కాల్స్ చేసుకునేందుకు డబ్బులు చెల్లించే అగత్యం తప్పిపోనుందని ప్రకటించారు.