Latest News

కేసీఆర్ తో జార్ఖండ్ సీఎం భేటీ ‘మేఘా’ డీల్ కోసమేనా?

posted on: Apr 29, 2022 2:57PM

జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ హైదరాబాద్ వచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ కావడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. గత నెలలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ జార్ఖండ్ సీఎంతో భేటీ అయిన సంగతి తెలిసిందే. నెల రోజుల వ్యవధిలోనే ఇరువురు సీఎంలూ రెండో సారి భేటీ కావడంతో కీలక రాజకీయ పరిణామంపై ప్రకటన ఉంటుందని భావిస్తున్నారు. జాతీయ స్థాయిలో బీజేపీయేతర కూటమి ఏర్పాటు విషయంపై ఇరువురి మధ్యా చర్చ జరిగిందని చెబుతున్నారు. త్వరలో హస్తినలో బీజేపీయేతర సీఎంల భేటీ ఏర్పాటు విషయంపై వీరిరువురి మధ్యా మంతనాలు జరిగాయనీ అంటున్నారు. 
అయితే ‘మేఘా’  సహా మరో రెండు కంపెనీలకు జార్ఖండ్ లో కాంట్రాక్టుల విషయంపై సీఎం కేసీఆర్స్వ స్యంవగా జార్ఖండ్ సీఎంకు సిఫారసు చేశారనీ, వీరిరువురి మధ్యా ఈ అంశమే ప్రధానంగా చర్చకు వచ్చింని చెబుతున్నారు.  సీఎంల భేటీలో ‘మేఘా’డీల్ ప్రస్తావన వచ్చినట్లు తెలుస్తున్నది. త్వరలోనే జార్ఖండ్ లో మేఘా కంపెనీ, మరో రెండు కంపెనీలకు కాంట్రాక్టులు లభించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. గురువారం హైదరాబాద్ వచ్చిన శిబు శొరేన్ నిన్న కేసీఆర్ తో భేటీ అయ్యారు. శుక్రవారం కూడా ఆయన హైదరాబాద్ లోనే ఉన్నారు. ఇక్కడ ఒక ప్రైవేటు హోటల్ లో ఆయన బస చేశారు.

ఇలా ఉండగా జార్ఖండ్ సీఎం వర్గాల కథనం ప్రకారం హేమంత్ సొరేన్ తన తల్లి వైద్యం కోసం హైదరాబాద్ వచ్చారు. ఇక్కడి ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్  డాక్టర్ నాగేశ్వరరెడ్డితో  కేసీఆర్ స్వయంగా మాట్లాడి అప్పాయింట్ మెంట్ ఫిక్స్ చేశారని చెబుతున్నారు.   హైదరాబశుక్రవారం శిబుసొరేత్ తల్లికి ఆ వైద్యుడు ఆపరేషన్ చేశారు. 
శనివారం  జరగనున్న జ్యుడీషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదస్సులో పాల్గనేందుకు హేమంత్ సొరేన్ హైదరాబాద్  నుంచే ఢిల్లీ వెళతారు.  అనంతరం తిరిగి నేరుగా హైదరాబాద్ చేరుకుంటారు. జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ మూడు రోజుల పాటు హైదరాబాద్ లోనే బస చేస్తారని చెబుతున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...