TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సీఎం ఇంట్లో కొవిడ్ కలకలం.. పిల్లలు సహా 15 మందికి వైరస్ 

Published on: Sun Jan 9, 2022 1:03PM

కరోనా మహమ్మారి కొరలు చాస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కేసుల సంఖ్య భారీగా పెరుతోంది. థర్డ్ వేవ్‌లో సైతం సాధారణ ప్రజల నుంచి రాజకీయ నాయకులు, సెలబ్రిటీల వరకు అందరూ కరోనా బారిన పడుతున్నారు. తాజాగా జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఇంట్లో కరోనా కలకలం రేపింది. ఆయన సతీమణితోపాటు ఇద్దరు పిల్లలు సహా మొత్తం 15 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. సీఎం నివాసానికి సంబంధించి మరికొంద మంత్రి రిపోర్టులు రావాల్సి ఉంది. అయితే ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్‌కు మాత్రం నెగెటివ్‌వచ్చిందని అధికారులు తెలిపారు. 

ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నివాసంలో ఇప్పటివరకు 62 మందికి కొవిడ్ పరీక్షలు చేసినట్లు రాంచీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ వినోద్ కుమార్ వెల్లడించారు వారిలో 24 మంది రిపోర్టులు శనివారం సాయంత్రం నాటికి వచ్చాయని.. వారిలో 15 మందికి పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. సీఎం భార్య కల్పనా సోరెన్, వారి ఇద్దరు కుమారులు నితిన్, విశ్వజిత్, కోడలు సరళా ముర్ము ఉన్నారని కుమార్ తెలిపారు. సోరెన్ నివాసంలో ఉన్న వారందరికీ తేలికపాటి కోవిడ్ -19 లక్షణాలు ఉన్నాయన్నారు. వారంతా ఇంట్లోనే సెల్ఫ్ క్వారెంటైన్ అయినట్లు తెలిపారు.

జార్ఖండ్ ఆరోగ్య మంత్రి బన్నా గుప్తా సైతం కోవిడ్ బారిన పడ్డారు. శనివారం పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు తెలిపారు. దీంతో ఆయన జంషెడ్‌పూర్‌లోని తన నివాసంలో ఐసోలేట్ అయ్యారు. ఇటీవల తనను కలిసిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. కాగా అంతకుముందు కూడా ఆరోగ్యమంత్రి కరోనా సోకింది.