TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అడ్డంగా బుక్కైన జె గ్యాంగ్ సభ్యుడు.. నోట్ల కట్టల వీడియోలు బయటపెట్టిన సిట్

Published on: Sat Aug 2, 2025 10:54PM

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో వైసీపీ గ్యాంగ్ ఒక్కరొక్కరుగా బుక్కౌతున్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి అత్యంత సన్నిహితుడైన వెంకటేష్ నాయుడు అడ్డంగా దొరికిపోయారు. ఆయన ఫోన్ నుంచే  డబ్బుల డెన్ వీడియోలను సిట్ రిట్రీవ్ చేసింది.  మద్యం ముడుపుల సొమ్ములు దాచిన డెన్ లో నోట్ల కట్టలను లెక్కిస్తూ చెవిరెడ్డి అత్యంత సన్నిహితుడు, ఆయన పీఏ అడ్డంగా దొరికిపోయాడు.   ఆ వీడియోతో మద్యం ముడుపుల డెన్ లో నోట్ల కట్టలతో చెవిరెడ్డి పీఏ వెంకటేష్ నాయుడు సిట్ కు అడ్డంగా దొరికిపోయాడు.

వెంకటేష్ నాయుడు ఫోన్ నుంచి రిట్రీవ్ చేసిన వీడియోలో డబ్బుల డెన్ లో నోట్ల కట్టలు లెక్కించుకుంటూ ఉన్న వీడియో సంచలనం రేపుతోంది.ఆ వీడియోను వెంకటేష్ నాయుడి ఫోన్ నుంచే సిట్ రిట్రీవ్ చేయడంతో మద్యం కుంభకోణంలో వందల కోట్ల రూపాయల సొత్తు అక్రమంగా దోచుకుని దాచేసుకున్న సంగతి తిరుగులేకుండా రుజువైనట్లైంది.  ఈ కేసులో ఇప్పటికే వెంకటేష్ నాయుడు ను సిట్ అరెస్ట్ చేసింది. ఇప్పటివరకూ తనకు మద్యం వ్యాపారంతో సంబంధం లేదంటూ వైసీపీ కీలకనేత చెవిరెడ్డి బుకాయింపులు అన్ని పచ్చి అబద్ధాలనీ తేలిపోయింది.