TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

దారి తప్పిన విమానం..విమానంలో 330 మంది ప్రయాణికులు

Published on: Mon Feb 20, 2017 10:30AM

ముంబై నుంచి లండన్ బయలుదేరిన జెట్ ఎయిర్‌వేస్‌కు చెందిన బోయింగ్ 777-300 9 డబ్ల్యూ 118 విమానం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు కోల్పోయింది. ఈ విమానంలో 330 మంది ప్రయాణికులు, 15 మంది సిబ్బంది ఉన్నారు. స్లోవేకియాలోని ఏటీసీ ఈ విమాన బాధ్యతలను పరాగ్వేలోని ఏటీసీకి అప్పగించే సందర్భంలో ఈ ఘటన చోటు చేసుకుంది. జెట్ ఎయిర్‌వేస్ సిబ్బంది కమ్యూనికేషన్ కోసం తప్పుడు ఫ్రీక్వెన్సీని ఎంచుకోవటంతో ఈ సమస్య తలెత్తినట్లు సమాచారం. రంగంలోకి దిగిన జర్మనీ వాయుసేనకు చెందిన రెండు యూరో ఫైటర్ విమానాలు దీనికి మార్గదర్శనం చేస్తూ రక్షణగా వెళ్లాయి..ఈ వీడియోని ది ఏవియేషన్ హెరాల్డ్ విడుదల చేసింది. అయితే దీనిని అధికారికంగా ధ్రువీకరించలేదు. ఈ పరిణామంతో విమానంలో ఉన్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.