TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ట్రంప్ కు జెలన్ స్కీ ఝలక్.. కక్కలేక, మింగలేక అమెరికా అధ్యక్షుడు

Published on: Tue Mar 4, 2025 11:03AM

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కు గట్టి ఝలక్ ఇచ్చారు. తాను ఉక్రెయిన్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటాననీ, అయితే ఉక్రెయిన్ కు నాటో సభ్యత్వం ఇవ్వాలని కండీషన్ పెట్టారు. దీంతో ట్రంప్ పరిస్థితి కక్కలేకా, మింగలేకా అన్నట్లుగా తయారైంది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నిక కావడానికి చాలా కారణాలు ఉండొచ్చు కానీ, తాను అధికారంలోకి రాగానే రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగిస్తానన్న హామీ కూడా ఆ కారణాలలో కచ్చితంగా ముందు వరుసలో ఉంటుంది.

ఆ విషయం తెలుసు కనుకనే ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టగానే రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు చర్యలు ఆరంభించారు. అయితే మధ్యవర్తిగా ఇరు దేశాల మధ్యా రాజీనామా చేయాల్సిన ట్రంప్ అందుక భిన్నంగా ఏకపక్షంగా వ్యవహరించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడిని రాజీనామా చేయాలని, అలాగే ఉక్రెయిన్ కూడా త్యాగాలకు సిద్ధపడాలని షరతులతో కూడిన సంధికి జెలెన్ స్కీని ఒప్పించేలా ఒత్తిడి తెచ్చాడు. ఉక్రెయిన్ కు నాటో సభ్యత్వం అన్న మాటే మరచిపోవాలని దాదాపు హుకుం జారీ చేశారు. అయితే ఇందుకు జెలన్ స్కీ గట్టి బదులే ఇచ్చారు.    నాటో సభ్యత్వం తన లక్ష్యమనీ, దేశాధ్యక్ష పదవి తనకేం ప్రధానం కాదనీ కుండబద్దలు కొట్టారు. ఉక్రెయిన్ కు నాటో సభ్యత్వం ఇస్తే.. అధ్యక్షుడిగా తాను దిగిపోతాననీ, రాజీనామా చేస్తాననీ షరతు పెట్టారు. 

ట్రంప్ తో విభేదించిన తరువాత లండన్ చేరిన జెలెన్ స్కీ అక్కడ యూరోపియన్ దేశాల సమావేశంలో మాట్లాడారు. ఆ సందర్భంగా ట్రంప్ కు ఈ షరతు పెట్టారు. గత వారం వైట్ హౌస్ లో ట్రంప్, ఉపాధ్యక్షుడు వాన్ తో జెలెన్ స్కీ గొడవపడ్డ విషయం తెలిసిందే. అమెరికాతో శాంతి ఒప్పందం, ఖనిజ ఒప్పందాలు చేయకుండానే వెళ్లిపోయారు.ఆ తరువాత శాంతి ఒప్పందానికి జెలెన్ స్కీ  అడ్డంకీగా మారాడని,రాజీనామా చేయ్యాలని ట్రంప్ అన్నారు.

ట్రంప్ వ్యాఖ్యలకు జెలెన్ స్కీ దీటుగానే బదులిచ్చారు.అమెరికాకు కృతజ్ఞతగా ఉంటామని,మళ్లీ ఆహ్వానిస్తే నిర్మాణాత్మక చర్చల కోసమైతే అమెరికా రావడానికి తనకు అభ్యంతరం లేదనీ చెబుతూనే.. రష్యా ఆక్రమించిన ఉక్రెయిన్ ప్రాంతాలను తిరిగి అప్పగించాలనీ డిమాండ్ చేశారు.  అంతే కాదు రష్యా భవిష్యత్ లో మళ్లీ ఉక్రెయిన్ పై దాడి చేయకూడదనీ, ఆ మేరకు స్పష్టమైన హామీ ఇవ్వాలనీ, అలాగైతేనే  శాంతి చర్చలకు అర్ధం ఉంటుందనీ కుండబద్దలు కొట్టారు.  అయితే ఉక్రేయిన్ కు నాటో సభ్యత్వం మొదటి నుంచి రష్యా వ్యతిరేకిస్తున్నది. ట్రంప్ కూడా నాటో సభ్యత్వం డిమాండ్ ను తోసిపుచ్చారు.    మొత్తం మీద ట్రంప్ శాంతి ప్రయత్నాలు రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధానికి ముగింపు సంగతి అలా ఉంచితే ప్రపంచ దేశాలను మరో యుద్ధం వైపు నడిపిస్తున్నాయన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.