జీవితా రాజశేఖర్‌పై అరెస్ట్‌ వారెంట్‌

 

సినిమాలతో పాటు రాజకీయభవిష్యత్తు కూడా సరిగా లేని జీవితా రాజశేఖర్‌కు ఇప్పుడు మరో ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా తన సినిమా కోసం ఓ రిటైర్డ్‌ ఇంజనీర్‌ దగ్గర అప్పు తీసుకొని అతని చెల్లని చెక్కు ఇచ్చిన నేరానికి జీవితా రాజశేఖర్‌ పై అరెస్ట్‌ వారెంట్‌ ఇష్యూ అయింది.

 

చిత్ర నిర్మాణం కోసం ఓ రిటైర్డ్ ఇంజినీర్ పరంధామ రెడ్డి వద్ద 36 లక్షల రూపాయలు తీసుకున్నారని.. అప్పు తీర్చడానికి జీవితా రాజశేఖర్ ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో బాధితుడు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గత రెండు సార్లుగా జీవితా రాజశేఖర్‌ విచారణకు హాజరు కాకపోవటంతో కోర్టు ఆమెపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ను జారీ చేసింది. అక్టోబర్ 29 తేదిలోగా జీవితా రాజశేఖర్ ను కోర్టులో హాజరుపర్చాలని జూబ్లీహిల్స్ పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.