బిజెపిలో ఎంతకాలం.. జీవితా రాజశేఖర్..‌!

 

 

 

సినీ దంపతులు జీవిత, రాజశేఖర్‌ భారతీయ జనతా పార్టీలో చేరారు. అయితే వీరి చేరికపై రాజకీయ, సినీ వర్గాలలో బిన్నవాదనలు వినిపిస్తున్నాయి. గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న వీరు..టిడిపిలో చేరడానికి ప్రయత్నాలు చేశారు. కాని అవి ఫలించకపోవడంతో..ఈరోజు బిజెపిలో అధికారకంగా చేరినట్లు తెలుస్తోంది. మోదీ మేనియాతో చాలా మంది ప్రముఖులు బిజెపి పార్టీలో చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.


దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మరణంతో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి..వైఎస్ జగన్ వెంటనడిచారు. కాని వారికి జగన్ ప్రాధాన్యత ఇవ్వపోవడంతో ఆయనకి కూడా దూరమయ్యారు. ఎట్టకేలకు ఈ రోజు బిజెపిలో చేరారు. కాకపోతె ఈ పార్టీలో ఎంతకాలం వుంటారో అన్న చర్చలు  మొదలయ్యాయి..!