జేడీ లక్ష్మీనారాయణ రాజీనామా ఆమోదం...

 

సీబీఐ మాజీ జేడీ, మహారాష్ట్ర అదనపు డీజీపీ లక్ష్మీనారాయణ స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన రాజీనామాకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇక ఇప్పుడు ఆయన రాజకీయాల్లోకి వచ్చేందుకే మార్గం సుగమం అయిందని అంటున్నారు. అంతేకాదు తన రాజీనామా ఆమోదం పొందిన తరువాత తన భవిష్యత్ కార్యాచరణ గురించి చెబుతానని లక్ష్మీ నారాయణ చెప్పడంతో.. ఇప్పుడు ఆయన ఏం నిర్ణయం తీసుకుంటారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.