TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రోడ్డుపై పడుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి

Published on: Mon Sep 22, 2025 6:18PM

 

అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌ రెడ్డి మరోసారి సంచలనానికి తెరలేపారు. నిత్యం ఏదో అంశంతో వార్తల్లో నిలిచే జేసీ, ఈసారి రోడ్డుపై పడుకుని నిరసన తెలిపారు. సోమవారం ఉదయం తాడిపత్రి డీఎస్పీ కార్యాలయం ఎదుటకు వచ్చి రోడ్డుపై పడ్డారు. దృశ్యం ఈ  చూసిన స్థానికులు ఆశ్చర్యపోయారు. వెంటనే పోలీసులు చేరుకుని చర్చలు ప్రారంభించారు.

మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి ఇచ్చిన పోలీస్‌ రక్షణపై ప్రశ్నలు లేవనెత్తిన ప్రభాకర్‌ రెడ్డి “ఆ రక్షణకు ఆయన డబ్బు చెల్లించారా? చెల్లించి ఉంటే రసీదు చూపించండి” అని డిమాండ్‌ చేశారు. అదనంగా, తమ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ, తమ అనుచరులపై కేసులు పెట్టారని, వాటిని వెనక్కి తీసుకోవాలని కోరారు.

పోలీసులు ఈ డిమాండ్లను అంగీకరించకపోవడంతో, ఆయన డీఎస్పీ కార్యాలయం వద్ద నుంచి అశోక్‌ పిల్లర్‌ సర్కిల్‌కు వెళ్లి అక్కడ కూర్చుని ధర్నా కొనసాగించారు. దీనికి పోలీసులు ఒప్పుకోకపోవడంతో  డీఎస్సీ ఆఫీస్ వద్ద నుండి అశోక్ పిల్లర్ సర్కిల్ వద్దకు చేరుకొని అక్కడ సర్కిల్లో కూర్చుని నిరసన తెలిపారు. తాను అడిగిన దానికి సమాధానం చెప్పాల్సిందేనంటూ జేసీ భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో పోలీసులు తలలు పట్టుకున్నారు.