రాజకీయాల్లోకి జేసీ పవన్
Published on: Tue Dec 24, 2013 2:15PM

రాష్ట్రమంత్రి జెసి దివాకర్ రెడ్డి సోదరుడి కుమారుడైన జెసి పవన్ రాజకీయాల్లోకి రానున్నాడు. మంగళవారం తన తండ్రితో కలిసి మీడియాతో మాట్లాడిన పవన్ ... తనను రాజకీయాల్లోకి రావాల్సిందిగా ప్రజలు కోరుతున్నారన్నాడు. సోనియాపై తన తండ్రి చేసిన విమర్శలను వక్రీకరించారంటున్న పవన్ ... తమ కుటుంబానికి ప్రజల్లో అమితమైన ఆదరణ ఉందన్నాడు. పవన్ మాటల్ని గమనిస్తే రాయలసీమ నుంచి మరో యువనేత రాజకీయ రంగప్రవేశానికి అంతా సిద్ధమైనట్టే ఉందని విశ్లేషకులు అంటున్నారు.


