జగన్ లెక్క మనిషి.. 30 కోట్లు అడిగాడు
Published on: Wed Jul 4, 2018 5:35PM

జేసీ దివాకర్ రెడ్డి.. ఏ పార్టీలో ఉన్నా ఆయన తీరు ఒకేలా ఉంటుంది.. సొంత పార్టీ వ్యక్తా? లేక ప్రత్యర్థి పార్టీ వ్యక్తా? అని చూడరు.. మనసుకి ఏది అనిపిస్తే అది చెప్తారు.. తాజాగా జేసీ.. చంద్రబాబు, జగన్ గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు..కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు చంద్రబాబును వ్యతిరేకించానని, ఆయనపై అప్పట్లో విమర్శలు కూడా చేశానన్నారు. కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమైన తరువాత జగన్ కంటే చంద్రబాబే మేలనిపించి టీడీపీలో చేరాను అన్నారు.. ఇప్పుడు గాంధీని మనం చూడలేకపోయినా, ప్రతి ఒక్కరికీ గాంధీ అంటే తెలుసునన్నారు.. చంద్రబాబు కూడా ప్రజలకు మేలు చేసే వ్యక్తిత్వమున్న వ్యక్తి అని, మంచి పనులు చేస్తే చనిపోయిన తరువాత కూడా పది కాలాలు గుర్తుంచుకుంటారనే తపన కలిగి మంచి పనులు చేస్తున్నారన్నారు..
కోనసీమకు నీరందిస్తే అక్కడ వరిమడులు మాత్రమే పండుతాయని, రాయలసీమకు నీరందిస్తే ఇక్కడ చీనీ, అరటి, దానిమ్మ వంటి పండ్లతోటల ద్వారా రైతులకు సంవత్సరానికి లక్షలాది రూపాయల ఆదాయం వస్తుందని భావించి.. ఎక్కడో ఉన్న నీటిని ఇక్కడికి మళ్లించిన ఘనత చంద్రబాబుదేనన్నారు.. చంద్రబాబు రైతులు బాగుపడాలని తపన పడే వ్యక్తి అని జేసీ అన్నారు.. అలానే జగన్ గురించి మాట్లాడిన జేసీ.. జగన్ లెక్క మనిషి అని, కడప భాషలో లెక్క లెక్క అంటూ నేటికీ పరితపించిపోతున్నారని, తన వద్దకు విజయసాయిరెడ్డిని పంపి రూ.30 కోట్లు అడిగారని అన్నారు. ఆ మాట వినగానే..‘ మీ నాన్న, మీ తాత కంటే నేను కూడా పెద్ద రెడ్డినే అని చెప్పాను' అన్నారు.


