తొడగొట్టి ఛాలెంజ్ విసిరిన జేసీ..

 

టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఏం చేసినా.. ఏం మాట్లాడినా.. అది హైలెట్ అవ్వాల్సిందే. తన మాటలతో, చేష్టలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. ఇప్పుడు తాజాగా మరోసారి హైలెట్ అయ్యారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ టీడీపీ ఎంపీలు, వైసీపీ ఎంపీలు పార్లమెంట్లో ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే జైట్లీ నిన్న ప్రెస్ మీట్లో మళ్లీ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని చెప్పడంతో... ఈరోజు ఆందోళనలు మరింత ఉదృతమయ్యాయి. అంతేకాదు రాజీనామాలకు సైతం సిద్దమయ్యారు. దీనిలో భాగంగానే అందరూ పార్లమెంట్ బయటనే ప్లకార్డులు పట్టుకొని పెద్ద ఎత్తున నినాదాలకు దిగారు. ఇక ఈ సందర్బంగా జేసీ.. అక్కడే ఉన్న వైసీపీ ఎంపీలకు ఓ సవాల్ విసిరారు. ఒంగోలు ఎంపి సుబ్బారెడ్డి టిడిపి మంత్రులు రాజీనామా చేస్తారనడం.. అవన్నీ డ్రామాలు అని విమర్శించిన నేపథ్యంలో దానిపై స్పందించిన జేసీ.. అక్కడే ప్లకార్డులు పట్టుకుని ధర్నా చేస్తోన్న వైకాపా ఎంపీల వద్దకు వెళ్లి... ఏమయ్యా..మేము డ్రామాలు ఆడుతున్నామా...? మీరేం చేస్తున్నారు...? ఇక్కడ నిలబడి...ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారు..? ఇదేనా మీరు చేసే ధర్నా..అంటూ..వారిని ప్రశ్నించారు. అంతేకాదు.. తాము ఇప్పుడే రాజీనామాలు చేస్తామని...మీకు దమ్ముంటే...ఇప్పుడే..రాజీనామాలు చేయాలని మీసం తప్పి..తొడకొట్టి సవాల్‌ చేశారు. దానికి వైసీపీ నేతలు మేము 21న అవిశ్వాస తీర్మానం పెట్టబోతున్నామని ఏప్రిల్‌6న రాజీనామాలు చేస్తున్నామని చెప్పడంతో.. ఆగ్రహానికి గురైన జేసీ మీరు డ్రామాలాడుతున్నారంటూ మండిపడ్డారు. దీంతో అక్కడ పరిస్థితి గమనించిన పార్లమెంట్‌ సిబ్బంది గొడవ జరుగుతుందేమో అని భయపడి జేసీ వారించి పార్లమెంట్ లోపలకి పంపించేశారు. ఏది ఏమైనా ఏపీ ప్రత్యేక హోదా విషయంలో మాత్రం అందరూ కలిసి పెద్ద డ్రామానే నడిపిస్తున్నారు. ఎవరి తగ్గ పాత్రల్లో వాళ్లు నటిస్తున్నారు... ఆఖరికి ఏం జరుగుతుందో చూద్దాం...