TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

చంద్రబాబు వాళ్ల ఉచ్చులో చిక్కుకున్నారు..

Published on: Fri Mar 2, 2018 11:23AM

 

ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా చెప్పడంలో టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి దిట్ట అని అందరికీ తెలిసిందే. ప్రతిపక్ష పార్టీలపైనే కాదు.. సొంత పార్టీ పైన కూడా నిర్మొహమాటంగా విమర్శలు గుప్పిస్తారు. అప్పుడప్పుడు పార్టీ అధినేత చంద్రబాబు పై కూడా సంచలన వ్యాఖ్యలు చేస్తారు జేసీ. తాజాగా మరోసారి చంద్రబాబుపై జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.  ఓ టీవీ చానల్ తో మాట్లాడిన జేసీ.. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పన్నిన ఉచ్చులో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చిక్కుకున్నారని, దాన్నుంచి ఆయన బయట పడలేకపోతున్నారని అన్నారు. అంతేకాదు.. చంద్రబాబు పెద్దమనిషి తరహాలో హోదా బదులు ప్యాకేజీ ఇస్తానంటే ఒప్పుకున్నారని, అది కూడా ఇవ్వకుంటే చూస్తూ ఊరుకోబోయేది లేదని అన్నారు. టీడీపీ ఎంపీలు రాజీనామాలు చేసినా కేంద్రం దిగి వచ్చే పరిస్థితి లేదు.. అమిత్ షాతో ఎంపీలు చర్చలు జరిపినా ఏమీ సాధించలేమని అన్నారు. ఇక ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనన్నదే తమ ప్రధాన డిమాండని తేల్చి చెప్పారు.