జగన్ బాగా తెలివైనవాడు..

 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై జేసీ దివాకర్ రెడ్డి మరోసారి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ప్రత్యేక హోదా కోసం పోరాడ‌తామ‌ని, ఏప్రిల్‌ 6న త‌మ లోక్ స‌భ స‌భ్యులు రాజీనామా చేస్తార‌ని ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. దీనిపై జేసీ జ‌గ‌న్ పై విమ‌ర్శ‌లు గుప్పించారు. జగన్ బాగా తెలివైనోడు.. 'ఏప్రిల్ 6న రాజీనామా చేస్తార‌ట‌....'ఎప్పుడో ఏప్రిల్ 6వ తారీఖు చేస్తారట.. జగన్ బాగా తెలివైనవాడు.. ఏప్రిల్ ఆరున రాజీనామాలు పంపితే వాటి అంగీకారానికి కనీసం రెండు నెలలు పడుతుంది. ఆపై కొన్ని నెల‌ల‌కే  జమిలి ఎన్నికలు వస్తాయి. నవంబర్ లేక డిసెంబరులో ఈ జ‌మిలి ఎన్నికలు వస్తాయి.. ఏపీ లోక్ స‌భ‌కి మళ్లీ ఎన్నికలు ఎందుకని ఎన్నికల కమిషన్ ఎన్నికలు జరపదు. నవంబర్ లేక డిసెంబరు వరకు ఆగుతుంది' అని అన్నారు. రెండు సంవత్సరాల క్రితం కూడా ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేస్తామని జ‌గ‌న్ చెప్పాడు అప్పుడు చేసింది లేదు ఏం లేదు... గుర్తు చేశారు. వైసీపీ ఎంపీలు రాజీనామా చేయాలనుకుంటే ఈ రోజే రాజీనామా చేయొచ్చుకదా? అని ప్రశ్నించారు.