TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

దానికోసం జగన్ 2కోట్లు ఖర్చుపెట్టారు..

Published on: Tue Aug 11, 2015 4:52PM

 

జేసీ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని వైఎస్సార్ పార్టీ ఆధినేత జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ధర్నాపై తెలుగుదేశం పార్టీ ఎంపి జేసీ దివాకర్ రెడ్డి విమర్శలు చేశారు. జగన్మోహన్ రెడ్డి ధర్నా కోసం రెండు కోట్టు ఖర్చు పెట్టారని.. ధర్నా వల్ల జగన్మోహన్ రెడ్డికి ప్రచారం వచ్చిందేమో కానీ, ఫలితం మాత్రం రాలేదని ఎద్దేవా చేశారు. అంతేకాదు నిరసనలు దీక్షలు గాంధీ కాలంలో చెల్లేవని విమర్శించారు. ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్ పార్టీ.. వైఎస్సార్ పార్టీలు మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. కాగా ఈ రోజు ఆంధ్రపదేశ్ లో తిరుపతి మినహా బంద్ చేపడుతున్న నేపథ్యంలో బంద్ ల వల్ల రాష్ట్రానికే నష్టమని.. వాటివల్ల ఎలాంటి ఉపయోగం లేదని అన్నారు.

 

ఇదిలా ఉండగా లోకసభలో ఏపీకి ప్రత్యేక హోదాపై తక్షణ చర్చ కోసం టిడిపి లోకసభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు నోటీసు ఇచ్చింది.