కాంగ్రెస్ కు జయసుధ గుడ్ బై.. టీడీపీలోకి..?
Published on: Sat Jan 16, 2016 1:45PM

కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. మాజీ శాసనసభ్యురాలు, సినీ నటి జయసుధ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్ పార్టీని వీడిన జయసుధ టీడీపీలో చేరనున్నట్టు జోరుగా వార్తలు వినిపిస్తున్నయి. దీనిలో భాగంగానే ఆమె ఈరోజు సాయంత్రం ఏపీ సీఎం చంద్రబాబును కలవనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే జయసుధ విజయవాడ చేరుకున్నారు.


