TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

జయప్రకాశ్ నారాయణకు గవర్నర్ పదవి! తీసుకోవడానికి సిద్ధంగా లేనన్న జేపీ 

Published on: Sat Dec 19, 2020 3:42PM

లోక్ సత్తా అధినేత,  రిటైర్డ్ ఐఏఎస్, మాజీ ఎమ్మెల్యే  జయప్రకాశ్ నారాయణకు కేంద్ర ప్రభుత్వం గవర్నర్ పదవిని ఇవ్వబోతోందనే ప్రచారం జోరుగా సాగుతోంది. గవర్నర్ పోస్టు పై అతనితో కేంద్రం పెద్దలు సంప్రదింపులు జరిపారని కూడా చెబుతున్నారు. అయితే తనపై వస్తున్న ప్రచారంపై స్పంందించారు జయప్రకాశ్ నారాయణ.  గవర్నర్ పదవిని స్వీకరించడానికి తాను సిద్ధంగా లేనని ఆయన స్పష్టం చేశారు. ప్రజలకు మేలు జరిగేలా, సమాజాన్ని మార్చేందుకు ఏ సంస్థ,  ఏ రాజకీయ పార్టీ  ప్రయత్నించినా  తాను వారికి మద్దతుగా ఉంటానని జేపీ చెప్పారు. 
       

రాజకీయాలకు తాను వ్యతిరేకం కాదన్న జయప్రకాశ్ నారాయణ.. రాజకీయాల ద్వారా మార్పును తీసుకొచ్చేందుకు  తన వంతు ప్రయత్నం చేశానని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను తాను స్వాగతించానని చెప్పారు. ఆర్టీసీ సమ్మె జరిగినప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న వైఖరిని కూడా తాను సమర్దించానని జేపీ తెలిపారు. పదవులు ఆశించి తాను అలా వ్యవహరించలేదని తేల్చి చెప్పారు. ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు ప్రజలకు ఉపయోగపడేలా  ఉంటే తాను వాటికి మద్దతుగా మాట్లాడుతానని,  సరిగా లేవని భావిస్తే ధైర్యంగా వ్యతిరేకిస్తానని చెప్పారు జయ ప్రకాశ్ నారాయణ.