పేరు ఏదైనా లక్ష్యం అదే...

 

లోక్ సత్తా వ్యవస్థాపకుడు జయ ప్రకాశ్ నారాయణతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ ముగిసింది. ఈసందర్భంగా పవన్ మీడియాతో మాట్లాడుతూ విభజన సమస్యలపై చర్చించాం...అన్నీ చర్చించలేదు... స్థూలంగా చర్చించాం...దిశానిర్దేశకం చేయాలని జేపీని కోరా.. ఒకే ఆలోచనపై సమూహంగా పోరాటం చేయాలి.. పేరు ఏదైనా విభజన హామీలు నేరవేర్చుకోవడమే లక్ష్యం అని అన్నారు. విభజన సమయంలో ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చలేదు..విభజన హామీలను పట్టించుకోవడం లేదు...సమస్యలు కేంద్రం దృష్టికి ఎలా తీసుకెళ్లాలన్న దానిపై ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు.