పవన్ కోరి కష్టాలు తెచ్చుకుంటున్నారు...

 

లోక్ సత్తా వ్యవస్థాపకుడు జయ ప్రకాశ్ నారాయణతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యాడు. బేగం పేట్ లోక్ సత్తా ఆఫీసుకు వెళ్లి అక్కడ జేపీ ని పవన్ ను కలిశారు. వీరిద్దరి మధ్య విభజన హామీల గురించి చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన జేపీ విభజన సమస్యలపై సుదీర్ఘంగా చర్చించామని... లక్షలాది మంది అభిమానులు ఉన్న పవన్ కోరి కష్టాలు కొనితెచ్చుకుంటున్నారని అన్నారు. పవన్ తో లోతుగా మనసు విప్పి మాట్లాడా..సమాజానికి న్యాయం చేయాలన్న బలమైన ఆకాంక్ష పవన్ దగ్గర ఉంది అని అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... రోడ్లమీదకి వచ్చి ప్రదర్శనలు చేయడం కంటే..  రెండు రాష్ట్రాల్లోనూ కలిసొచ్చే వారిని కలుపుకొని... కేంద్ర ప్రభుత్వంపై ఎఫెక్టివ్ గా ఒత్తిడి తేవాలి... అందరితో సమావేశం ఏర్పాటు చేద్దామని పవన అన్నారు. విభజనతో దెబ్బతిన్న ఏపీకి న్యాయం జరిగి తీరాలి అని జేపీ అన్నారు.