రాష్ట్రపతికి జెపి లేఖ
Published on: Wed Dec 4, 2013 7:18PM
.jpg)
రాష్ట్ర విభజన అంశంపై లొక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ రాష్ట్రపతికి లేఖ రాశారు. కేంద్ర రాష్ట్ర ప్రజల మనోభావాలకు విలువనివ్వకుండా విభజన విషయంలో మొండిగా ముందుకు వెళుతుందని, తెలంగాణ బిల్లు రాష్ట్రపతి దగ్గరకు వచ్చినప్పుడు తప్పకుండా అసెంబ్లీ ఆమోదాన్ని పరిగణలొకి తీసుకోవాలని ఆయన కోరారు. కేంద్రం అసెంబ్లీకి బిల్లు రాకుండానే ఆర్టికల్ 3 ద్వారా పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టాలని ప్రయత్నిస్తుందని.. అలా జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆయన రాష్ట్రపతిని లేఖలో కోరారు.


