TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాజమహేంద్రవరం వద్ద గోదవరిలో జయప్రద సోదరుడి అస్తికల నిమజ్జనం

Published on: Thu Mar 6, 2025 9:49AM

టాలీవుడ్ సీనియర్‌ నటి, మాజీ ఎంపీ జయప్రద సోదరుడు రాజ‌ బాబు  హైద‌రాబాద్‌లోని నివాసంలో గత నెల 27న మరణించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని జయప్రద స్వయంగా ఇన్‌స్టా వేదికగా తెలిపారు. ఈ పోస్ట్‌ చూసిన నెటిజన్లు, సినీ ప్రముఖులు జయప్రద కుటుంబానికి సానుభూతి తెలియజేశారు.  రాజ‌బాబు అస్థిక‌ల‌ను   కుటుంబ స‌భ్యులు రాజ‌మహేంద్రవరంలోని పుష్క‌ర్‌ఘాట్ వ‌ద్ద   గోదావరి జ‌ల‌ల్లో నిమజ్జనం చేశారు.

 రాజబాబు కుమారుడు సామ్రాట్‌తో క‌లిసి రాజ‌మండ్రికి వ‌చ్చిన జ‌య‌ప్ర‌ద ద‌గ్గ‌రుండి రాజ‌బాబు అస్థిక‌ల నిమ‌జ్జ‌న కార్య‌క్రమాన్ని నిర్వ‌హించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన జయప్రద  రాజ‌మహేంద్రవరం  పుణ్య‌భూమిలో తన సోదరుడు  రాజ‌బాబు అస్థిక‌ లు క‌లిపామనీ,  రాజబాబు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాడని వివరించారు. తాను రాజమహేంద్రవరానికి ఎప్పుడొచ్చినా రాజబాబు తోడుగా వచ్చేవాడని గుర్తు చేసుకున్నారు. మొట్ట‌మొద‌టి సారి అత‌డు లేకుండా రాజమహేంద్రవరం వచ్చానని ఆవేదనగా చెప్పారు.