TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సీఎంగా రేపు జయలలిత ప్రమాణ స్వీకారం

Published on: Fri May 22, 2015 10:59AM

అక్రమఆస్తుల కేసులో అన్నా డీఎంకే అధినేత్రి జయలలితపై ఉన్న కేసును బెంగుళూరు కోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె ఇప్పుడు మళ్లీ తమిళనాడు ముఖ్యమంత్రి పదవిని చేపట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. అంతకు ముందు తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న పన్నీరు సెల్వం ఇచ్చిన రాజీనామాను ఆ రాష్ట్ర గవర్నర్ కొణిజేటి రోశయ్య ఆమోదించి.. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని జయలలితను ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో ఆమె శుక్రవారం గవర్నర్ తో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా శనివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.