జయలలిత సినీ, రాజకీయ ప్రస్థానం..

 

జయలలిత ఫిబ్రవరి 24, 1948న అప్పటి మైసూరు రాష్ట్రంలోని పాండవపుర తాలూకా, మేలుకోటేలో జయరాం, వేదవల్లి దంపతులకు జన్మించింది. జయలలిత తల్లి ఒక తమిళ అయ్యంగార్ బ్రాహ్మణ వంశానికి చెందినది కాగా బ్రాహ్మణ సంప్రదాయాన్ని అనుసరించి ఆమెకు రెండు పేర్లు పెట్టారు. అందులో అసలు పేరు కోమలవల్లి. అది జయలలిత అవ్వగారి పేరు. ఇక జయలలిత అనే రెండో పేరును పాఠశాలలో చేర్చేటపుడు నమోదు చేశారు. ఆ తరువాత తన 15 వ ఏటనే సినిమారంగ ప్రవేశం చేసి తిరుగులేని పేరు సంపాదించుకుంది.

కథానాయకుని కథ(1965)

మనుషులు మమతలు(1965)

ఆమె ఎవరు? (1966)

ఆస్తిపరులు (1966)

కన్నెపిల్ల (1966)

గూఢచారి 116(1966)

నవరాత్రి (1966)

గోపాలుడు భూపాలుడు (1967)

చిక్కడు దొరకడు(1967)

ధనమే ప్రపంచలీల(1967)

నువ్వే (1967)

బ్రహ్మచారి (1967)

సుఖదుఃఖాలు(1967)

అదృష్టవంతులు(1968)

కోయంబత్తూరు ఖైదీ(1968)

తిక్క శంకరయ్య(1968)

దోపిడీ దొంగలు(1968)

నిలువు దోపిడి(1968)

పూలపిల్ల (1968)

పెళ్ళంటే భయం(1968)

పోస్టుమన్ రాజు(1968)

బాగ్దాద్ గజదొంగ(1968)

శ్రీరామకథ (1968)

ఆదర్శ కుటుంబం(1969)

కథానాయకుడు(1969)

కదలడు వదలడు(1969)

కొండవీటి సింహం(1969)

పంచ కళ్యాణి దొంగల రాణి (1969)

ఆలీబాబా 40 దొంగలు (1970)

కోటీశ్వరుడు (1970)

గండికోట రహస్యం(1970)

మేమే మొనగాళ్లం(1971)

శ్రీకృష్ణ విజయం(1971)

శ్రీకృష్ణసత్య (1971)

భార్యాబిడ్డలు(1972)

డాక్టర్ బాబు (1973)

దేవుడమ్మ (1973)

దేవుడు చేసిన మనుషులు (1973)

లోకం చుట్టిన వీరుడు(1973)

ప్రేమలు - పెళ్ళిళ్ళు(1974) 

జయలలిత తొలి సినిమా " చిన్నడ గొంబె కన్నడ " చిత్రము పెద్ద హిట్టయ్యింది.  ఈమె తొలి తెలుగు సినిమా " మనుషులు మమతలు " ఈమెను పెద్దతార స్థాయికి తీసుకెళ్లింది.

 

ఆ తరువాత 1981లో తమిళనాడు రాజకీయాలలో ప్రవేశం చేసింది. ఆమె నటిగా ఎం.జి.ఆర్ సరసన ఎన్నో చిత్రాలలో నటించింది. ఎం.జీ.ఆర్ రాజకీయాలలో ప్రవేశించిన తరువాత జయలలిత కూడా రాజకీయాల్లోకి వచ్చి ఎంజీఆర్ కు వారసురాలిగా పేరు తెచ్చుకుంది. అయితే కొన్ని కారణాల వల్ల ఎంజీఆర్ తో విభేదాలు రాగా ఆయన ఆగ్రహానికి గురై పార్టీలోని పలు పదవులకు దూరమైంది. ఎంజీఆర్ మరణానంతరం జయలలితకు పార్టీనుండి మంచి సపోర్ట్ లభించింది. ఎంజీఆర్ మరణించిన తరువాత పార్టీ రెండుగా చీలింది. ఒక వర్గం ఎంజీఆర్ భార్య జానకి రాంచంద్రన్ కు మద్దతు పలికితే ఇంకో వర్గం జయలలితకు అండగా నిలబడ్డారు. జానకీ రాంచంద్రన్ తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు. కాని, 21రోజుల్లోనే రాష్ట్రం రాష్ట్రపతి పాలనలోకి వెళ్లిపోయింది. దాంతో జానకీ రామచంద్రన్ ఏఐఏడీఎంకే పార్టీ నుంచి తప్పుకున్నారు. జయలలిత పార్టీలో తిరుగులేని నాయకురాలిగా ఎదిగారు. అప్పుడు 1989 అసెంబ్లీ ఎన్నికలలో జయలలిత విజయం సాధించి తొలి మహిళా ప్రతిపక్ష నాయకురాలిగా స్థానంసంపాదించారు. దాని తరవాత 1991లో రాజీవ్ గాంధీ మరణానంతరం జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించింది. ప్రజలచే ఎన్నిక కాబడిన తొలి తమిళనాడు మహిళా ముఖ్యమంత్రిగా అవతరించింది. ఇక ఆ తరువాత డీఎంకే పార్టీని అధిగమించగల పార్టీగా అవతరించి.. పార్టీకి ఎప్పటికప్పుడు గట్టి పోటీనిస్తూనే ఉంది.

*   1972లో తమిళనాడు ప్రభుత్వము జయలలితను కళైమామణి పురస్కారముతోసత్కరించింది.

*   1988 లో రాజ్యసభకు నామినేట్ చేయబడి గెలిచింది.

*   1989 డీఎంకే పార్టీ తమిళనాడు ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో ఆమె ప్రతిపక్ష నేతగా ఉండాల్సి వచ్చింది.

*   ఏఐఏడీఎంకే, కాంగ్రెస్ కూటమి డీఎంకేను మట్టి కరిపించింది. జయలలిత తొలిసారి సీఎం అయ్యారు...

* 1996 లో జయలలితపై వచ్చిన కొన్ని అభియోగాలు కారణంగా ఓటమిపాలైంది.

*   2001 ఎన్నికల్లో గెలిచి రెండోసారి తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత ఎన్నికయ్యారు.

*  2006 ఎన్నికల్లో మళ్లీ ఓడిపోయారు.

*   2011 లో తిరుగులేని ఎన్నిక.

* సెప్టెంబరు 27, 2014 న జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టు అయింది. దాంతో ఆమె తన ముఖ్యమంత్రి పదవి రద్దైనది.

* మే 11, 2015న కర్ణాటక ఉన్నత న్యాయస్థానము ఆమెను నిర్దోషిగా విడిచిపెట్టింది. దాంతో ఆమె మే 23న తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టింది

* ఇక అప్పటి వరకూ చేతులు మారుతూ వచ్చిన ఆధికారం వల్ల.. జయపై వచ్చిన ఆరోపణల వల్ల 2016.. ఈఏడాది జరిగిన ఎన్నికల్లో ఎవరు గెలుస్తారా అని అందరూ ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూశారు. అయితే అందరి అంచనాలను తిరగరాస్తూ.. వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి అయిన రికార్డ్ ను సృష్టించి జయలలిత ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు.