జయలలిత జీవితంలో తెలియని ఎన్నో నిజాలు..

 

తమిళనాడు ముఖ్యమంత్రి (పురచ్చి తలైవి) మరణించడంతో తమిళనాడు ఒక్కసారిగా స్థంభించిపోయింది. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ముఖ్యమంత్రి జయలలిత ఇక లేరు అన్న వార్త వినగానే అభిమానులకు ప్రాణం పోయినంత పని అయింది. ఎన్నో ఒడిదుడుకులు అడ్డుకొని ముఖ్యమంత్రిగా ఎదిగిన ఆమె జీవితంలో మనకు తెలియని ఎన్నో నిజాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం..

కర్నాటకలో పాత మైసూరు సంస్థానంలోని మాండ్యాలో పుట్టిన ఆమె అసలు పేరు కోమల పల్లి. 

* నాయకురాలిగా, నటిగా ఆమె జీవితమంతా తమిళనాడులోనే సాగింది

ఆమె విశ్రాంతి అంతా హైదరాబాదులోనే కొంపెల్లి ప్రాంతంలో ఉండే ఫామ్ హౌజులోనే ఉండేది

ఆమె అయిదో ఏట నుంచే భరతనాట్యం నేర్చుకోగా.. తల్లి బలవంతం మీద 15 వ ఏటనే సినిమాల్లోకి అడుగుపెట్టింది….

ఆమె మొదటి సినిమాలో యంగ్ విడో పాత్ర… మెట్రిక్ స్టేట్ ర్యాంకర్ ఓ యంగ్ విడో పాత్ర పోషించడం ఐరనీ…

* ఆ తొలి సినిమాకు సెన్సార్ ఇచ్చిన రేటింగ్ ‘పెద్దలకు మాత్రమే’…

తనకు అప్పటికి 15 ఏళ్ల వయసే కాబట్టి తన తొలి సినిమాను తనే థియేటర్ లో చూడలేకపోయిందట….

*  స్లీవ్ లెస్ బ్లౌజు వేసుకుని, జలపాతం కింద తడుస్తూ పాటలో నటించిన తొలి తమిళ నటి కూడా జయలలితనే…

* ఆమె సినిమా కెరీర్ మొదట్లోనే శోభన్ బాబును ప్రేమించింది.. ఆ ప్రేమ అలాగే కొనసాగింది. అందుకే ఆమె వివాహం చేసుకోలేదు.

* అయితే శోభన్ బాబుతో ఆమెకు శోభన (ప్రియ మహాలక్ష్మి) అనే కూతురు పుట్టిందనీ మాత్రం ప్రచారం ఉంది కానీ ఆమె గురించి ఇప్పటి వరకూ ఎవరికి తెలియదు

* తమిళంలో ఆమె సిల్వర్ జుబ్లీ సినిమాలే అధికం.. 85 సినిమాల్లో 80 హిట్టే…ఇజ్జత్ అనే హిందీ సినిమాలోనూ నటించింది అదీ హిట్టే. ఇక తెలుగులో ఆమె నటించినవి 28 సినిమాలు.

* ఆమెకు ఒక సోదరుడు కూడా ఉన్నాడు పేరు జయకుమార్. అతను 1995లో చనిపోయాడు.

* అతి చిన్న వయసులోనే ముఖ్యమంత్రిగా ఎన్నికైన వారిలో జయలలిత ఒకరు. ఆమెకు ఇంగ్లిషు పుస్తకాలు చదవడమంటే మహా ఇష్టం… ఎప్పటికీ ఆమెతో ఆ పుస్తకాలు ఉంటాయి… ఆమె మంచి రచయిత్రి కూడా… ఎస్టరియర్ తమిళ వీక్లీలో థాయ్ పేరుతో రాస్తూ ఉండేది.

* క్రికెట్ మ్యాచులంటే కూడా ఆమెకు ఇష్టమే. కేవలంపటౌడీని చూడటం కోసమే ఆమె క్రికెట్ మ్యాచులకు వెళ్లేదట.

* దత్తపుత్రుడి పెళ్లి జరిపినప్పుడు లక్షన్నర మందికి ఆతిథ్యం ఇచ్చింది… ఇది గిన్నీస్ రికార్డు…తన దత్తపుత్రుడి పెళ్లి ఖర్చు అప్పట్లోనే 100 కోట్లు అని విమర్శ కాగా, 10 కోట్లేనని ఐటీ శాఖ అంచనా వేసింది…

* తన ప్రియసఖి శశికళతో ఆమె బంధం గురించి రకరకాల దుష్ప్రచారాలున్నాయి… శశికళను కాస్త దూరం ఉంచడం మొదలెట్టగానే ఇదే శశికళ జయలలితకు స్లోపాయిజన్ కుట్ర చేసిందని తెహెల్కా కథనం…అప్పటి నుంచే జయ ఆరోగ్యం క్షీణించి, చివరకు రోజల తరబడీ చికిత్స చేసినా చక్కబడలేదనేది విమర్శ…

* 1992లో కుంభకోణంలో మహామకం ఉత్సవాల్లో ఆమె సంప్రదాయ స్నానమాచరించడానికి వెళ్లగా అక్కడ జరిగిన జనం తొక్కిసలాటలో 50 మంది మృతిచెందారు.
18)1992 లోనే అప్పటి గవర్నర్ చెన్నారెడ్డి తన పట్ల అమర్యాదగా వ్యవహరించాడని ఆమె ఆరోపించింది.

* సుబ్రహ్మణ్యస్వామి 1996లో జయలలితపై కేసు పెట్టినప్పుడు బయటపడ్డ ఆస్తులు మొత్తం 66 కోట్లు. అయిదే అందులో
అందరినీ ఆకర్షించినవి 12,000 చీరెలు, 30 కిలోల బంగారం, 2,000 ఎకరాల భూమి, 750 జతల చెప్పులు, 8 క్వింటాళ్ల వెండి…

* 1997లో ఆస్తుల జప్తు జరిగినప్పుడు, ఇక ఆభరణాలు ధరించనని ఒట్టు పెట్టుకుని, తిరిగి అధికారంలోకి వచ్చాకే 2011లో ధరించింది.

* పాలనలో ఆమె నియంతలాగే వ్యవహరిస్తుందని ఎవరైనా విమర్శలు చేసినా, వార్తలు రాసినా ఎడాపెడా పరువునష్టం కేసులు పెట్టించేది. కానీ విధేయత విషయంలో మాత్రం పాతకాలం చక్రవర్తులు కూడా పనికిరారు అని అనేవారు.

* ఇక పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేల పాదాభివందనాలు చాలా కామన్. ఆమె కళ్లల్లోకి నేరుగా చూడొద్దనీ, బొకే ఇచ్చేసి, వెనక్కి తిరిగి వీపు చూపకుండా, వెనక్కి వెనక్కి నడిచిరావాలని గన్ మెన్ చెప్పేవారట.

* స్కూళ్లో ఓ క్లాస్ మేట్ లవ్ కు పోస్ట్ మ్యాన్ గా వ్యవహరించింద. ఆమె తల్లికి తెలియగానే తనపై నిందలు వేసి తప్పుకుందట.

* మొదట్లో ఎంజీఆర్ ఆమెను సందేహించేవాడట… ఆమె ప్రతి కదలికపై నిఘా వేసి ఉంచేవాడట…వీడియో పార్లర్ నడుపుకునే శశికళను కూడా గూఢచర్యం కోసమే ఎంజీఆర్ జయలలిత వద్ద ఉంచాడట.

* 1981లో రాజకీయాల్లోకి రాగానే, 1983లో రాజ్యసభ సభ్యురాలైంది. అయితే 1984లో ఎంజీఆర్ కు స్ట్రోక్ వచ్చి, అనారోగ్య సమస్యల్లో ఉంటే, ఈమె రాజీవ్ ను, గవర్నర్ ఖురాను కలిసి సీఎంను చేయమని అడిగిందట. దాంతో ఆమె ఎంజీఆర్ కోపానికీ గురైంది.

* 1986లో ఎంజీఆర్ తో పడకపోవడంతో ఆయనకు పోటీగా జయలలిత పెరవై అనే సమాంతర ఆర్గనైజేషన్ ను కూడా స్టార్ట్ చేసిందట…