TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అందుకే జయలలిత చనిపోయిందట!

Published on: Wed Jun 6, 2018 11:28AM

 

జయలలిత మరణం గురించి విచారించే కమిటీ ముందు కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. వీటిలో శివకుమార్‌ అనే వైద్యుడు చెప్పిన కొన్ని వివరాలు, జయ మృతి పట్ల ఉన్న అనుమానాలను కొంతవరకూ నివృత్తి చేయగలిగాయి. జయలలిత తన ఆహారం మీద అదుపు ఉంచుకునేవారు కాదనీ, షుగర్ పేషెంట్‌ అయి ఉండి కూడా... తనకి ఇష్టమైన పదార్థాలన్నీ తినేసేవారనీ చెప్పుకొచ్చారు. ద్రాక్ష, ఐస్‌క్రీం, చాక్లెట్‌, కేక్... ఇలా ఏది పడితే అది తినేవారట. అపోలోలో చేరిన తర్వాత కూడా తన సొంత వంటవాడిని తెప్పించుకొని, తనకి ఇష్టమైన పదార్థాలను వండించుకునేవారట. ఆఖరికి ఇంగ్లండ్ వైద్యులు చెప్పినా కూడా ఆవిడ మాట విననేలేదట. ఆ జిహ్వచాపల్యమే ఆవిడ కొంప ముంచిందని చెప్పుకొచ్చారు శివకుమార్‌!