శశికళ కొట్టడం వల్ల "అమ్మ" చనిపోయింది..?
Published on: Mon Feb 27, 2017 11:15AM
.jpg)
దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతిపై ఇప్పటికీ వీడని చిక్కుముడులు ఎన్నో..74 రోజుల పాటు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడిన జయ చివరికి మరణించారు. అయితే అసలు జయ ఆస్పత్రిలో ఎందుకు చేరారు..ఆ 74 రోజుల కాలంలో అపోలోలో ఏం జరిగింది అన్నది మిస్టరీగా మారింది.
ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే సీనియర్ నేత పొన్నయ్యన్ బాంబు పేల్చారు. శశికళ కొట్టడం వల్లే జయలలిత తీవ్ర అనారోగ్యానికి గురై..ఆస్పత్రి పాలయ్యారని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం నివాసం వద్ద జరిగిన సమావేశంలో పొన్నయ్యన్ ఈ ఆరోపణలు చేశారు. అపోలో ఆస్పత్రిలో జయలలితను చూసేందుకు ఎవరినీ అనుమతించలేదని..చివరకు పన్నీర్ సెల్వానికి అదే పరిస్థితి ఎదురైందని అన్నారు..అపోలో ఆస్పత్రిలో చాలా విషయాలు దాగి ఉన్నాయని వ్యాఖ్యానించారు..ఈ విషయంలో శశికళ, అపోలో యాజమాన్యానికి మధ్య ఒప్పందం జరిగిందని అన్నారు.


