TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

జైలులో "అమ్మ"కు చిన్నమ్మ నివాళులు

Published on: Sat Feb 25, 2017 9:39AM

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జయంతి వేడుకలు తమిళనాడు వ్యాప్తంగా ఘనంగా జరిగాయి..అన్నాడీఎంకే శ్రేణులు, అమ్మ అభిమానులు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అటు అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో కూడా జయ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. కాగా, జయలలిత స్నేహితురాలు, ప్రస్తుత అన్నాడీంకే అధినేత్రి శశికళ జైల్లోనే తన స్నేహితురాలికి నివాళులు అర్పించారు. ప్రతీ రోజు మాదిరిగానే శశికళ వేకువజామునే లేచి స్నానానంతరం తులసిచెట్టుకు నీరు పోసిన తర్వాత తన గదిలో ఉంచుకున్న జయ ఫోటో వద్ద కొన్ని పూలు పెట్టి ప్రార్థన చేసుకున్నారట..ఆ సమయంలో తన పక్క గదిలో ఉంటున్న మరొక నిందితురాలు ఇళవరసి కూడా ఆమెతో కలిసి ప్రార్థన చేశారని తెలిపారని బెంగళూరు పరప్పన అగ్రహార జైలు అధికారులు తెలిపారు..నిన్న వారిద్దరినీ ఎవరూ కలుసుకోలేదని వారు వెల్లడించారు.