TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జయ మరణంపై తేల్చేసిన అపోలో అధినేత...

Published on: Tue Dec 20, 2016 11:33AM

 

జయలలిత మరణంపై ఇంకా చాలా మందికి చాలానే అనుమానాలు వున్నాయి. ఆమె 75రోజులు అనారోగ్యంతో పోరాడి ఓడారు. పైగా ఇక అమ్మ ఆసుపత్రి నుంచి వచ్చేస్తోందని వార్త వెలువడ్డాక అంతా ఊపిరి పీల్చుకున్న సమయంలో అనూహ్యంగా గుండెపోటు కలకలం రేగింది. కేవలం కొన్ని గంటల్లోనే ఆమె అంతమయ్యారని డాక్టర్లు ప్రకటించారు. ఇదంతా చూస్తే ఎవరికైనా అనుమానం రాక తప్పదు. మరీ ముఖ్యంగా, గౌతమీ లాంటి ఒక తమిళ సినిమా సెలబ్రిటీ కూడా ప్రధానికి లేఖ రాయటం మరింత అనుమానాలకి తావిస్తోంది. కాని, మోదీ సర్కార్ ఇప్పుడప్పుడే జయలలిత మరణంపై విచారణ లాంటి ఆలోచనలు ఏం చేస్తున్నట్టు కనిపించటం లేదు. ప్రస్తుతానికి అందరూ ఆమె హార్ట్ ఎటాక్ తోనే చనిపోయారని నమ్మాల్సిందే.

 

జయలలిత స్లో పాయిజన్ వల్ల చనిపోయారనీ, అపోలో ఆసుపత్రిలో ఏం చికిత్స చేశారో బయట పెట్టాలనీ చాలా మంది అంటున్నారు. అలాగే  ఆ మధ్య రాహుల్ ట్విట్టర్ ని హ్యాక్ చేసిన లిజియన్ గ్రూప్ వాళ్లు అపోలో సర్వర్ ని తాము హ్యాక్ చేశామని చెప్పారు. అందులో తమకు తెలిసిన విషయాలు బయటపెడితే అల్లకల్లోలం జరుగుతుందన్నారు. కాని, తరువాత లిజియన్ గ్రూప్ హ్యాకర్స్ కూడా పురుచ్చి తలైవీ డెత్ సీక్రెట్స్ ఏం బయటపెట్టలేదు. అయితే, జయ మరణం తరువాత ఇన్ని రోజులకి అపోల్ చైర్మన్ ప్రతాప రెడ్డి నోరు విప్పారు...

 

తమ హాస్పిటల్ లో చేరిన జయతో తాను రెగ్యులర్ గా టచ్ లో వుండే వాడ్నని చెప్పిన ఆయన ఆమె చికిత్సకి చక్కగానే స్పందించారనీ, సహకరించారనీ చెప్పారు. 75రోజులు చెన్నైలోనే వుండి ముఖ్యమంత్రి చికిత్సని పర్యవేక్షించిన ప్రతాప్ రెడ్డి ఆమెకు అనూహ్యంగా గుండె పోటు వస్తుందని ఊహించలేకపోయామని చెప్పారు. స్ట్రోక్ వచ్చాక ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆమెను కాపాడలేకపోయామని విచారం వ్యక్తం చేశారు! 

 

జయలలిత మృతిపై ఇక ముందు కూడా జనాలకి ఎన్నో అనుమానాలు వుంటూనే వుంటాయి. కాని, ప్రస్తుతానికి మాత్రం అపోలోచైర్మన్ ప్రతాప్ రెడ్డి స్వయంగా చెప్పిన మాటల సాక్షిగా ఆమె గుండెపోటుతో సహజంగానే మరణించారని భావించాలి. ఇది కాక మరొక సత్యం ఏదైనా వుంటే అది ఎప్పుడో అప్పుడు తప్పక వెలుగు చూడాలని ఆశిద్దాం...